ASBL NSL Infratech

కలర్‌ ఫోటో చిత్రం ప్రారంభం

కలర్‌ ఫోటో చిత్రం ప్రారంభం

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్‌తో సినిమాలు తీసిన అమృత ప్రొడక్షన్స్‌ తదుపరి చిత్రం కలర్‌ ఫోటో. మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. చాందిని చౌదరీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సునీల్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన సందీప్‌ రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మత్తు వదలరా ఫేమ్‌ కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం 1995లో ఒక ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది. ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు యూనిట్‌ త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది. నిర్మాతలు: సాయి రాజేష్‌ నీలం, బెన్నీ ముప్పానేని, కెమెరామెన్‌: వెంకట్‌ ఆర్‌ శాఖమూర్తి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :