Revanth Reddy:ఏపీ సీఎం చంద్రబాబు తో చర్చలకు సిద్ధం : రేవంత్‌రెడ్డి

బనకచర్ల అంశం గురించి కూర్చొని మాట్లాడుకుంటే వివాదం ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బనకచర్ల-గోదావరి (Banakacherla-Godavari) ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఏపీ, కేంద్రానికి పీఎఫ్‌ఆర్ (PFR) ఇవ్వడం వల్లే వివాదం మొదలైంది. పీఎఫ్‌ఆర్ ఇచ్చేముందే తెలంగాణలో చర్చించి ఉంటే వివాదం ఉండేదికాదు. ఆంధ్రప్రదేశ్ ప్రీ ఫీజిబులిటీ రిపోర్ట్ (పీఎఫ్‌ఆర్) ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తోంది. బనకచర్లపై కేంద్రం అన్ని రకాల చర్యలకు సిద్ధమైంది. ఇద్దరు సీఎంలు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై చర్చిద్దాం. ఒక రోజు కాదు నాలుగు రోజులైనా చర్చిద్దాం. రాష్ట్రాల మధ్య జలవివాదాలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయి. న్యాయ, సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం. వివాదాల పరిష్కారంలో నాకెలాంటి బేషజాలు లేవు. ఇద్దరు వ్యక్తులు కాదు, రాష్ట్రాల మధ్య వ్యహారం ఇది. విభజనచట్టం ప్రకారం ప్రాజెక్టుల్లో మార్పులు చేస్తే చెప్పుకోవాలి. విభజన చట్టం ప్రకారం గతంలో సీఎంల స్థాయిలో చర్చలు జరిపాం. అనేక అంశాలను సీఎం స్థాయిలో చర్చించాం అని అన్నారు.