Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు

గురుపౌర్ణమి (Guru Purnima) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల (Sai Baba Temples)కు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే బాబా దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ (Telangana)లోని హనుమకొండ, నల్గొండ, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు, విజయవాడ (Vijayawada) తదితర ప్రాంతాల్లోని సాయి మందిరాల్లో భక్తులు రద్దీ కనిపించింది. మహారాష్ట్రలోని షిర్డీ ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.