Pawan Kalyan: దేశ వ్యతిరేక పోస్టులపై పవన్ కల్యాణ్ ఘాటు హెచ్చరిక..

భారతదేశం (India) ఇటీవల పహల్గాం (Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) అనే పేరుతో ఒక కీలక దాడిని చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం (Indian Army) పాకిస్తాన్ (Pakistan) మరియు పీవోకే (PoK ) ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మిస్సైల్ సర్జికల్ స్ట్రైక్స్ (missile surgical strikes) జరిపింది. ఈ దాడిలో సుమారు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. ఈ విజయవంతమైన సైనిక చర్యపై దేశం మొత్తం గర్వభావాన్ని వ్యక్తం చేస్తోంది.
ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల (Telugu states) ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (Andhra Pradesh Deputy Chief Minister) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా స్పందించారు. భారత సైన్యం చూపిన ధైర్యం, స్పష్టత ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పవన్ అన్నారు. పాకిస్తాన్ మిలటరీ (Pakistan military) మరియు పౌరులకు నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరగడం ఒక అసాధారణమైన వ్యూహాత్మక చర్యగా పేర్కొన్నారు.
తన ప్రసంగంలో పవన్ కొంత ఆవేశంతో మాట్లాడారు. గాంధీ సిద్ధాంతాలపై నడిచిన దేశంగా మన భారతదేశ చరిత్ర గొప్పదని గుర్తు చేస్తూ, శాంతి మార్గాన్ని అనుసరించినా, దేశం వెలుపల నుంచి కొందరు దేశంలోకి ప్రవేశించి మతాన్ని ప్రశ్నిస్తూ హిందువులను (Hindus) టార్గెట్ చేస్తుండటాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. 1990 నుండి కాశ్మీర్ లో పండిట్ల (Kashmir Pandits) పై జరిగిన ఉగ్రవాద దాడులు అక్కడి పరిస్థితులను తీవ్రమైనవిగా మార్చినట్టు చెప్పారు. అంత్యక్రియల సమయంలో కూడా హత్యలు చేయడం ఒక మానవతావ్యతిరేక చర్య అని అన్నారు.
ఈ రోజు ఉదయం జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్ సోషల్ మీడియా విషయంలో కూడా తన ఆందోళనను వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు , ఇన్‌ఫ్లుయెన్సర్లు బాధ్యతగా వ్యవహరించాలి అని, దేశాన్ని దూషించే విధంగా ఎలాంటి పోస్టులు పెట్టకూడదని సూచించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో బయట కుక్కలు అరవడం వినిపించింది. దాన్ని ఆయన ఇలా అభివర్ణించారు – “ఎవరికి తోచినట్టు అనవసరంగా పోస్టులు పెట్టడం, ఆ కుక్కలు మొరగడమేలాంటిది,” అంటూ కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు.
దేశ భద్రతకు వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశ భద్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, భారత ప్రయోజనాల్ని కాపాడే బాధ్యత మనందరిపైనా ఉందని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. అలాగే తెలియని విషయాల్లో పోస్టులు చేసి అల్లర్లు రేపే విధంగా వ్యవహరించకూడదని, ఇలా చేస్తే అశాంతికి కారణమవుతుందని హెచ్చరించారు.