Ys Jagan: జగన్ తలుపుతట్టిన సిట్..?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం(Liquor Scam) విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకీ ఏం జరగబోతోంది అనే ఆసక్తి జనాల్లో పెరిగిపోతుంది. మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసిన తర్వాత.. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జగన్(Ys Jagan) మాజీ, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి పై ఎక్కువగా దర్యాప్తు బృందం ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి పై కూడా దృష్టి పెట్టారు. ఇక దీనితో పాటుగా వైఎస్ జగన్ సతీమణి వైయస్ భారతి వ్యాపార వ్యవహారాలను చూసే బాలాజీ గోవిందప్ప పై కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం గురి పెట్టింది.
ఇక తమను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన ఈ ముగ్గురు.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా లాభం లేకపోయింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అరెస్టును అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన సరే సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి అరెస్టు చేసే అధికారాలు కల్పించింది. ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగగా కోర్టు ముందస్తు బెయిల్, పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీనితో వీళ్ళ ముగ్గురిని అరెస్టు చేస్తే తర్వాత ఎవరిని అరెస్టు చేస్తారు, అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా జగన్ మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి పైనే దర్యాప్తు బృందం గురిపెట్టినట్లు సమాచారం. అటు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగిన సమయంలో.. కృష్ణమోహన్ రెడ్డి తరఫున న్యాయవాది.. వాదన హాట్ టాపిక్ అయింది. తమకు ఏ సంబంధం లేదని ప్రభుత్వ పెద్దల నిర్ణయం తీసుకున్నారని ఆయన వాదించారు. దీనితో కచ్చితంగా జగన్ పై గురిపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక బాలాజీ గోవిందప్పను అరెస్టు చేస్తే కచ్చితంగా వైఎస్ భారతి పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.