ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఈ నెల 30న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం

ఈ నెల 30న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైకాపా దూసుకెళ్తోంది. 150కి పైగా స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా సీనియర్‌నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30న జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ఎల్లుండి వైకాపా శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో ప్రభుత్వ సొమ్మును పంచిపెట్టి ఓట్లు పొందాలని చూశారని, అయినా ఎన్నికల్లో ఘోరా పరాజయం తప్పలేదని ఊమ్మారెడ్డి విమర్శించారు.

 

Tags :