ASBL NSL Infratech

అమెరికాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు!

అమెరికాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు!

తెలుగింటి క్రాంతి సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలో స్థిరపడిన తెలుగువారికి సంక్రాంతి పెద్ద సంబరమే.

“సరదాగా ఈ సాయంత్రం సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం రండి!” అంటూ ఆహ్వానం పలికిన  మెంఫిస్ తెలుగు సమితి అధ్యక్షులు పేరి కృష్ణ శనివారం సాయంత్రం 4 నుండి 9 వరకు వెస్ట్ కాలిర్వీల్లి హై స్కూల్లో “తెలుగు పల్లె”ని అద్భుతంగా  ఆవిష్కరించారు. అట్టహాసంగా జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమం ఓ దృశ్య కావ్యంగా సాగింది.  పల్లె వాకిట రంగవల్లులు సహజం కానీ, దేశం కానీ దేశంలో  రంగవల్లులే కాదు, చిన్నారులకి భోగి పళ్ళు,  చెరుకు గడలు, పట్టు చీరల రెపరెపలు, జరీ అంచు ఉత్తరీయాలు. ఎటు చూసినా పండుగ వాతావరణం, అంబరాన్నంటిన కోలాహలం. ఈ ఉత్సవంలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా అందరికి సుపరిచితుడు అయిన సందుగు శ్రీకాంత్ సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ. మెంఫిస్ తెలుగు సమితి గత రెండువారాలుగా సాహిత్య, సంగీత, నృత్య, ముగ్గులు, చిత్రలేఖనం, వ్యాసరచన, మరెన్నో విభాగాల్లో పోటీలు నిర్వహించింది. ఈ సంక్రాంతి సంబరాల్లో విజేతలకు సర్టిఫికేట్లు, బహుమానాలు ప్రధానం చేసారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ సంక్రాంతి సంబరాల్లో స్థానిక తెలుగు కుటుంబాలు వైవిధ్యంతో కూడుకొన్న సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలు, అన్నమయ్య సంకీర్తనలకు నృత్యాలు, జానపద నృత్యాలు, టాలీవుడ్ చిత్ర గీతాలకి నృత్యాలు ప్రదర్శించారు. 

నోరూరించే ఆవకాయ పచ్చడి, కమ్మ(ని) పొడి,  గులాబ్జామూన్, వడలు, పులిహోర, మామిడికాయ పప్పు, బెండకాయ కూర, గుత్తి వంకాయ కూర, దద్దోజనం ఇలా మరెన్నో వంటకాల విందుభోజనం, ఆంద్ర కిళ్ళీ ఆరగింపుతో కార్యక్రమం పసందుగా ముగిసింది.  

కుండవజ్జుల దీప, తీగలపల్లి ఫణి, నందికంటి మహేష్, చిలుక శ్రీధర్, కళ రోహిణి, బయన్న అనిల్, వల్లూరి రాజేష్, వడ్లమూడి చక్రధర్, ఒంటరి స్వప్న, లంక అనిల్, చంద్రగిరి అవినాష్, వాడ్రేవు కీర్తి, చింతల లోకేష్, గౌడప్పగారి వీర మోహన, గుంటుపల్లి రఘు, గౌరవరం రాహుల్ మరియు సనపల రమేష్ ఈ కార్యక్రమ నిర్వాహక కార్యవర్గం. స్వచ్ఛంద కార్యకర్తలు తో పాటు మెంఫిస్ తెలుగు సమితి 2019 యువ కార్యనిర్వాహక వర్గం చురుకుగా పాల్గొని తమ వంతు సాయిశక్తుల సహాయం అందించారు.

ధర్మకర్తలు పారుపూడి కిరణ్, ముప్పాళ ప్రభాకర్ వర్మ, చింతమనేని వెంకట్, గిలెడి కిరణ్మయి మరియు ఘనుకోట శశిరాము కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి తమ వంతు  సహాయ సహకారాలు అందించారు.

Click here for Event Gallery

Tags :