ASBL NSL Infratech

గుడివాడ లో తానా మాస్క్ ల పంపిణీ

గుడివాడ లో తానా మాస్క్ ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో గుడివాడలో కరోనా వైరస్‍ వ్యాప్తిని నిరోధించేందుకు మాస్క్ లను పంపిణీ చేశారు. గుడివాడ మున్సిపల్‍ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బందికి నాణ్యమైన మాస్క్ లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మునిసిపల్‍ కమీషనర్‍, డిప్యూటీ కమీషనర్‍ తదితరులు పాల్గొన్నారు. తానా ఫౌండేషన్‍ ట్రస్టీ వెంకట్‍ యార్లగడ్డ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Click here for Photogallery

 

Tags :