ASBL NSL Infratech

బే ఏరియా పాఠశాల కేంద్రాల్లో దీపావళి వేడుకలు

బే ఏరియా పాఠశాల కేంద్రాల్లో దీపావళి వేడుకలు

బే ఏరియాలోని పాఠశాల చిన్నారులు దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మాతృభాష తెలుగును చిన్నారులకు సులభంగా నేర్పుతూనే మన సంస్కృతి, పండుగలను కూడా వేడుకగా చేయడంలో పాఠశాల యాజమాన్యం ముందుంటోంది. దీపావళిని పురస్కరించుకుని బే ఏరియా పాఠశాల డైరెక్టర్లు డా. రమేష్‌ కొండ, ప్రసాద్‌ మంగిన పాఠశాలను సందర్శించి చిన్నారులకు దీపావళి శుభాకాంక్షలతోపాటు స్వీట్లను పంచిపెట్టారు. పాఠశాల చిన్నారులకు తెలుగును నేర్పుతున్న టీచర్ల సేవలను కూడా వారు ప్రశంసిస్తూ వేడుకలను చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు దీపావళి ప్రాముఖ్యతను వివరించేలా పాటలను, ప్రసంగాలను చేశారు. అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి, పాఠశాల ఎండి చెన్నూరి వెంకట సుబ్బారావు కూడా పాఠశాల చిన్నారులకు దీపావళి శుభాకాంక్షలను తెలిపారు.

బే ఏరియాలో పాఠశాలను బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా), తెలుగు టైమ్స్‌ కలిసి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల చిన్నారులకు బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ కార్యవర్గం కూడా దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు. బాటా ప్రెసిడెంట్‌ శిరీష బత్తుల, వైస్‌ ప్రెసిడెంట్‌ యశ్వంత్‌ కుదరవల్లి, సెక్రటరి సుమంత్‌ పుసులూరి, ట్రెజరర్‌ హరినాథ్‌ చికోటి, జాయింట్‌ సెక్రటరీ కొండల్‌రావు, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, కళ్యాణ్‌ కట్టమూరి, కల్చరల్‌ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, లాజిస్టిక్‌ కమిటీ సభ్యులు ప్రశాంత్‌ చింట, అరుణ్‌ రెడ్డి, వరుణ్‌ ముక్క, బాటా అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు.

బే ఏరియాలో పాఠశాల కో ఆర్డినేటర్లు కూడా చిన్నారులకు దీపావళి శుభాకాంక్షలను తెలిపారు. శాన్‌రామన్‌ సెంటర్‌ టీచర్‌ కో ఆర్డినేటర్‌ శ్రీదేవి ఎర్నేని, ఏరియా కో ఆర్డినేటర్లు సత్య బుర్ర, కళ్యాణి చికోటి, డబ్లిన్‌ సెంటర్‌ టీచర్‌, కో ఆర్డినేటర్‌ సరస్వతీ రావు, ఏరియా కో ఆర్డినేటర్లు వందన సరికొండ, రజిత రావు, వెంకట్‌ బండారు, ఇషా వరకూర్‌, కళ్యాణి చికోటి, సన్నివేల్‌ సెంటర్‌ టీచర్‌, సెంటర్‌ కో ఆర్టినేటర్‌ పద్మ శొంటి, ఏరియా కో ఆర్డినేటర్లు ఉమ గాయత్రి, సాయి లక్ష్మీ, శ్రీధర్‌ బాబు, ఉదయ్‌ ఈయుణ్ణి, లక్ష్మీ ప్రసన్న, ధనలక్ష్మీ, మానస, సురేష్‌ శివపురం, శాన్‌ హోసె సెంటర్‌ టీచర్‌, కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ దాశరథి, ఏరియా కో ఆర్డినేటర్లు మూర్తి వెంపటి, లలిత పీసపాటి, యుతిక దాశరథి, ఫ్రీమాంట్‌ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ రామదాసు పులి, ఏరియా కో ఆర్డినేటర్లు పద్మ విశ్వనాథ, జశ్వంత్‌ మండలి, లావణ్య అరుగొండ, సునీత రాయపనేని, శ్రీదేవి గుజ్జల, దీపిక బి, శ్రీదేవి పసుపులేటి, లాజిస్టిక్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ మంగిన, అకడమిక్‌ డైరెక్టర్‌ డా. రమేష్‌ కొండ, కరికులం డైరెక్టర్‌ డా. గీత మాధవి కూడా పాఠశాల స్టూడెంట్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Click here for Event Gallery

 

Tags :