ASBL NSL Infratech

ఇవాంకా పర్యటన వివరాలు

ఇవాంకా పర్యటన వివరాలు

28వ తేదీ (మంగళవారం)
- 3.00 తెల్లవారుజామున: ఇవాంకా శంషా బాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాను బస చేసే హోటల్‌కు వెళ్ళారు.
- మధ్యాహ్యం 2.50 వరకు: రిజర్వ్‌ సమ యం (అధికారులు వివరాలు వెల్లడించకుండా.. ‘రిజర్వు’గా పేర్కొన్నారు)
- 3.00: ఇవాంకా హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు.
- 3.10– 3.25: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ
- 3.35– 3.55: ప్రధాని మోదీతో భేటీ
- 4.00–4.25: భారత స్టార్టప్‌ల అధునాతన ప్రదర్శన ‘ది ఇండియన్‌ ఎడ్జ్‌’ను తిలకిస్తారు.
- 4.25: ప్రధాని మోదీతో కలసి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటారు.
- 4.45–4.50: ప్రారంభోత్సవ వేదికపై ప్రసంగిస్తారు.
- 5.15–5.45: ప్లీనరీ సెషన్‌లో ‘మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు– నాయక త్వం’పై నిర్వహించే చర్చాగోష్టికి ప్యానెల్‌ స్పీకర్‌గా ఉంటారు.
- 5.50–6.00: హెచ్‌ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.
- 7.15: హోటల్‌ నుంచి బయల్దేరుతారు.
- 8.00: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు.
- 8.05–8.20: ‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’పేరుతో ఏర్పాటు చేసే భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శనను తిలకిస్తారు.
- 8.20–8.35: భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌షోను తిలకిస్తారు.
- 8.45: ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులతో కలసి విందులో పాల్గొంటారు.
- 10.00: ఫలక్‌నుమా నుంచి బయల్దేరుతారు.
- 10.40: హోటల్‌కు చేరుకుని బస చేస్తారు.

29వ తేదీ (బుధవారం)
- ఉదయం 9.00: అమెరికా బృందంతో బ్రేక్‌ఫాస్ట్‌
- 9.50: హోటల్‌ నుంచి హెచ్‌ఐసీసీకి బయలుదేరుతారు.
- 10.00: సదస్సు ప్లీనరీ సెషన్‌లో ‘వి కెన్‌ డూ ఇట్‌.. అన్ని రంగాల్లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం’ అంశంపై చర్చాగోష్టి లో పాల్గొంటారు.
- 11.00: హెచ్‌ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. భోజన విరా మం అనంతరం మహిళా పారిశ్రామిక ప్రతి నిధులతో ట్రైడెంట్‌ హోటల్‌లో ముఖాముఖి
- 5.35: హోటల్‌లోనే సిబ్బందితో విందు చేసి విమానాశ్రయానికి బయల్దేరుతారు
- 8.20: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు
- 9.20: దుబాయ్‌ ఎమిరేట్స్‌ విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.

Tags :