ASBL NSL Infratech

ముఖ్యమంత్రి ప్రసంగం ముఖ్య విశేషాలు

ముఖ్యమంత్రి ప్రసంగం ముఖ్య విశేషాలు

న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్నారైలను ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. ఎన్నారైల ప్రతిభను మెచ్చుకుంటూనే, మరోవైపు జన్మభూమి అభివృద్ధిలో కూడా పాలుపంచుకోవాల్సిన అవశ్యకతను కూడా వారికి గుర్తు చేశారు. హైటెక్‌ సిటీ నుంచి ఎన్నారైల ఓటు హక్కు వరకు ఎన్నో విషయాలపై ఆయన ప్రసంగించారు. మన తెలుగు వారి సమర్థత, తెలివితేటలు ప్రపంచానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. ప్రపంచంలో అనేక పెద్దపెద్ద కంపెనీలు సంపాదించిన డబ్బును తిరిగి చారిటీ ద్వారా ఖర్చు పెడుతున్నారు. ఎన్నారై తెలుగువాళ్ళు కూడా జన్మభూమి అభివృద్ధికి ముందుకు రావాలన్నారు.

అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరూ నా రాష్ట్రానికి, నా ఊరుకు నేనేం చేయగలను అని ఆలోచిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ మరింత ప్రగతి పథంలోకి దూసుకుపోతుందన్నారు. అమెరికాలో ఉండే తెలుగువారంతా తెలుగు రాష్ట్రాల అభివ ద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీపైనా అభిమానం ఉండే ప్రతిఒక్క వ్యక్తి రియల్‌ టైంలో తెలుగుదేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌లో చేరి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలి. దాని ద్వారా ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలు ఉంటుంది.

మీ శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలు ఎంతో కొంతైనా స్వరాష్ట్రానికి వినియోగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో రియల్‌ టైమ్‌ గవర్నన్స్‌ ద్వారా పాలనలో సాంకేతికతను తీసుకొచ్చి.. ప్రజలకు పాలన మరింత చేరువ చేయగలిగామన్నారు. అవినీతిని నియంత్రిస్తున్నామని తెలిపారు. ప్రపంచం గ్లోబల్‌ విలేజ్‌ గా మారుతున్న ఈ సమయంలో మీరు మన ఆంధ్రప్రదేశ్‌ కోసం ఇక్కడ నుంచే ఎన్నో అద్భుతాలు చేయవచ్చని అందులో మీరు పాల్గొనవచ్చని చెప్పారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని.. పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనువైన రాష్ట్రంగా గుర్తింపును కూడా పొందిందని చంద్రబాబు తెలిపారు.

జన్మభూమి రుణం తీర్చుకునే తరుణం మీకు వచ్చిందని.. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మీ సొంత ఊరిలో మీరు పెట్టుబడి పెట్టి.. ఆ ఊరి అభివద్ధికి కూడా దోహదపడవచ్చన్నారు.

ప్రవాస భారతీయులందరికీ ఓటు హక్కు రాబోతోంది. అంచేత అందరూ ఓటు హక్కు వినియోగించుకుని తెలుగుదేశం పార్టీని మరోసారి గెలిపించేందుకు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Click here for Photogallery

Tags :