ASBL NSL Infratech

ఆటా ఉమెన్స్ డే

ఆటా ఉమెన్స్ డే

ఆటా ఆధ్వర్యంలో వినూత్నంగా మహిళలు ప్రతి రంగంలో రాణించాలి అనే ఉద్దేశంతో ‘#ఇన్స్పిరే ఇంక్లూషన్’ థీమ్’ తో ఉమెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మార్చ్ 9 వ తారీఖున వర్చ్యువల్ గా నిర్వహించే ఈ కార్యక్రమం లో Accenture గ్లోబల్ ఎండీ రేవతి సుబ్రమణియన్, బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తదితరులు పాలుపంచుకుంటారు అని ఉమెన్స్ చైర్ ప్రవీణ అంబటి ఒక ప్రకటనలో తెలియచేసారు. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఆటా కార్యవర్గం తరపున మహిళలకు అడ్వాన్స్డ్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియచేసారు. మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాలని ఆకాంక్షించారు. ఆటా ఉమెన్స్ డే ఈవెంట్స్ అట్లాంటా, బోస్టన్, డల్లాస్, ఫీనిక్స్, వాషింగ్టన్ డీ.సి నగరాల్లో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు.

 

 

 

Tags :