Terror Attack: పాక్ కు భారత్ మరో షాక్

పహల్గామ్(Pahalgam) ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకున్న తీసుకున్న నిర్ణయం తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట ద్వారా నీటి ప్రవాహాన్ని భారత్ కొన్నాళ్ళ పాటు నిలిపివేసింది. ఇక జాతీయ మీడియా కథనాల ప్రకారం, కిషన్‌గంగా ఆనకట్టపై కూడా కేంద్రం ఇలాంటి చర్యలకు దిగే అవకాశం ఉంది. బాగ్లిహార్ ఆనకట్ట సింధు జలాల ఒప్పందానికి అనుగుణంగా నిర్మించారు.
పరిమితంగా నీటిని నిల్వ చేసే సామార్ధ్యం దీని సొంతం. అయితే ఇక ప్రవాహం పెరిగితే మాత్రం నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఇది మాత్రం పాకిస్తాన్(Pakistan) కు ఖచ్చితంగా హెచ్చరిక లాంటిదే అంటున్నారు నిపుణులు. బగ్లిహార్ ఆనకట్ట నిర్మించిన.. చీనాబ్ భారత్ కు పశ్చిమంగా ఉంటుంది. ఈ నదీ జలాల ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్, చినాబ్ నది నీటిని ఎంతైనా వాడుకునే అవకాశం ఉంది. ఇక భారత్ ఈ నీటిని వ్యవసాయానికి, జలవిద్యుత్ ఉత్పత్తి వంటి వాటికి మాత్రమే వినియోగించేలా ఒప్పందం చేసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో నిర్మించిన బగ్లిహార్ ప్రాజెక్ట్ ఒక రన్-ఆఫ్-ది-రివర్ పవర్ ప్రాజెక్ట్. రన్-ఆఫ్-ది-రివర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ తక్కువగా ఉంటుంది లేదంటే అసలు ఉండదు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం 900 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశ 2008లో, రెండవ దశ 2015లో పూర్తయింది. నది ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే కిషన్‌గంగా ప్రాజెక్ట్ కూడా బందీపూర్‌లో ఉంది. దీని సామర్థ్యం 330 మెగావాట్లు. ఈ రెండు ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
డిజైన్లు, పరిమితులు జల ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. బాగ్లిహార్ ఆనకట్ట పరిమితులు.. సంఘర్షణ సమయంలో భారత్ కు వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తాయి. భారతదేశం నీటిని ఆపడానికి చేసే ఏ చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ ఇంతకుముందు హెచ్చరించింది. పహల్గామ్‌లో 26 మంది ప్రాణాలు తీసిన తర్వాత.. రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.