Delhi: ఇక పాకిస్తాన్ అడుక్కు తినాల్సిందేనా..? గ్రే లిస్టులో చేర్చేలా భారత్ ప్రయత్నాలు..!

పాకిస్థాన్‌ను ఆర్థికంగా ఏకాకి చేసే దిశగా భారత్ చర్యలు వేగవంతం చేసింది. లష్కరే వంటి ఉగ్ర సంస్థలకు ఫండింగ్ చేస్తున్నందుకు తగిన శిక్ష పడేలా భారత్ ప్రయత్నిస్తోంది. తాజాగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌లో కూడా పాక్‌ను తిరిగి ‘గ్రే లిస్ట్’(Grey list)లోకి చేర్చేందుకు చర్యలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఐఎంఎఫ్ నిధుల కోసం పాక్ చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టాలంటే ఎఫ్‌ఏటీఎఫ్(FTF) చర్యలే కీలకంగా మారాయి.
ఈసారి ఎఫ్‌ఏటీఎఫ్ భేటీలో పాక్‌పై నిఘాను పెంచాలన్న ప్రతిపాదన భారత్ తీసుకొచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి దీనిని గ్రేలిస్ట్‌గా పేర్కొంటారు. ఈ జాబితాలో కొన్నేళ్లపాటు ఉన్న తర్వాత పాక్ 2022లో బయటపడింది. నాడు మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్స్‌ను అడ్డుకోవడానికి తీసుకొంటున్న చర్యలను చూపించి ఊరట పొందింది.
భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయడానికి పాక్ టెర్రర్ ఫైనాన్సింగ్, మనీలాండరింగ్‌కు సహకరించిందన్న ఆధారాలు భారత్ వద్ద ఉన్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్‌లో గతంలో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు. వాటిని ప్రపంచ వేదికపై అవసరమైనప్పుడు బయటపెట్టాలన్నారు. ఎఫ్‌ఏటీఎఫ్‌లో భారత్ సభ్యదేశం. ఇక పాకిస్థాన్ మాత్రం ఆసియా పసిఫిక్ గ్రూప్ ఆఫ్ మనీలాండరింగ్‌లో ఓ భాగం.
రానున్న రోజుల్లో పాక్‌కు ఆర్థిక ప్యాకేజీ పై ఐఎంఎఫ్ (IMF) బోర్డ్ సమావేశంలో కూడా భారత్ ఈ అంశాన్ని లేవనెత్తనుంది. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్‌కు ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడాన్ని భారత్ వ్యతిరేకించనుంది. ‘‘ఐఎంఎఫ్ బోర్డు, ఎఫ్‌ఏటీఎఫ్ ఎదుట పెట్టేందుకు ఇప్పటికే ఆధారాలు సేకరించాము. ఉగ్రవాదానికి మద్దతు, ఆశ్రయం ఇచ్చే దేశాలకు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు వెళ్లకూడదన్న అంశంపై భారత్ గట్టిగా నిలబడనుంది’’ అని ఓ అధికారి వెల్లడించారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఎఫ్‌ఏటీఎఫ్ సమీక్ష సమయానికి మూడు దేశాలు బ్లాక్‌లిస్ట్‌లో, 25 దేశాలు గ్రేలిస్ట్‌లో ఉన్నాయి.