Toronto: కెనడా నూతన సర్కార్ కు ఖలిస్తానీల షాక్.. యధావిధిగా హిందూ వ్యతిరేక ఆందోళనలు

కెనడా (Canada)లో మరోసారి ఖలిస్తానీలు పేట్రేగారు. దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటువాదులు టొరంటో (Toronto) లోని మాల్టన్ గురుద్వారాలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ బొమ్మలను ఓ బోన్‌లో పెట్టి ప్రదర్శించారు. ఇటీవల ఖలిస్థానీ మద్దతుదారులు ఓ గురుద్వారా, మందిరంలో విధ్వంసం సృష్టించారు.
కెనడాలోని హిందూ సమాజానికి చెందిన నేత షాన్ బిందా ఈ వీడియోను ఎక్స్ఠ్‌లో పోస్టు చేశారు.ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు. ఖలిస్థానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణం్ఠ్ఠ అని రాసుకొచ్చారు. మరోవైపు.. ఆమోదయోగ్యం కాని చిత్రాలను ప్రదర్శించిన ఖలిస్థానీల చర్యను భారత ప్రభుత్వం సైతం ఖండించింది. విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ.. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్న భారత వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని భారత్ కోరింది
మరి ఇప్పుడు కెనడా నూతన ప్రభుత్వం ఏం చేయనుంది…? భారత్ తో సత్సంబంధాలు నెరపుతామంటూ ఇప్పటికే సంకేతాలిచ్చిన కార్నీ సర్కార్..ఇప్పుడు ఖలిస్తానీలను ఎలా అదుపు చేయనుంది. ఓ ఉగ్రవాద సానుభూతి గ్రూప్ కోసం..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో తమ వైరాన్ని కొనసాగిస్తుందా..? లేదంటే దేశంలో కాస్త కఠినమైన వైఖరి అవలంభించి.. ఖలిస్తానీలను అదుపు చేయనుందా..? వారిని అదుపు చేయకుంటే.. మళ్లీ కెనడా భారత్ మధ్య ఇదే తరహా వైరం, దూరం కొనసాగనున్నాయని చెప్పకతప్పదు.