ASBL NSL Infratech

యూట్యూబ్ కు పోటీగా.. త్వరలో

యూట్యూబ్ కు పోటీగా.. త్వరలో

ఎలాన్‌ మస్క్‌కు చెందిన ట్విటర్‌ను కొనుగోలు చేసి దాని పేరును ఎక్స్‌గా మార్చే వరకు అనేక మార్పులు చేశారు. తాజాగా యూట్యూబ్‌కు ధీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేక టీవీ యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఎక్స్‌ సీఈఓ లిండా యాకరి నో ప్రకటించారు. ఎక్స్‌ టీవీ యాప్‌ ఇంటర్‌ఫేస్‌ కూడా యూట్యూబ్‌ మాదిరిగానే ఉండనుంది. చిన్న తెర నుంచి పెద్ద తెర వరకు ఎక్స్‌ అన్నింటినీ మార్చేస్తోంది. ఎక్స్‌ టీవీ యాప్‌తో నూతన ఆకర్షణీయమైన కంటెంట్‌ను మీ స్మార్ట్‌ టీవీల్లోకి త్వరలో తీసుకురాన్నట్లు తెలిపారు. పెద్ద స్క్రీన్‌లపై అత్యంత నాణ్యమైన కంటెంట్‌, అందులో లీనమయ్యే అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఇది రూపుదిద్దుకుంటోంది. అని ఎక్స్‌ సీఈఓ లిండా యాకరినో తన సోషల్‌ మీడియా ఖాతాలో తెలిపారు. టీవీ యాప్‌ విశేషాలతో పాటు, ఇంటర్‌ పేస్‌ ఎలా ఉంటుందన్న విషయానికి సంబంధించి చిన్న వీడియోను ఆమె పోస్ట్‌ చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :