విజయవంతంగా ముగిసిన తానా కళాశాల వార్షిక పరీక్షలు. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం!

అమెరికాలోని తానా సంస్థ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కూచిపూడి, భరతనాట్యం మరియు సంగీతం కోర్సులకి ఎనలేని స్పందన లభిస్తోంది. గడచిన నాలుగు వారాలలో నాలుగు వందలకు పైగా అమెరికాలోని తెలుగు పిల్లలు కూచిపూడి భరతనాట్యం మరియు కర్ణాటక సంగీతం కి సంబంధించిన థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసి పై స్థాయి తరగతులలో చేరడానికి సంసిద్దులవుతున్నారు.
ఇటీవల జరిగిన తానా, పద్మావతి విశ్వవిద్యాలయం సమావేశంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దువ్వూరు జామున గారు మాట్లాడుతూ ఈ కోర్సులు మన భారతీయ కళలు వాటితో పాటు మన సంస్కృతి సంప్రదాయాలు పట్ల అమెరికాలో పుట్టి పెరుగుతున్న చిన్నారులకు ఆసక్తి అవగాహన పెంపొందించడానికి దోహద పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఈ కోర్సులను అమెరికా అంతటా మరింత విస్తృత పరచడానికి మున్ముందు తానా మరింత కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
తానా కళాశాల చైర్మన్ డా. అడుసుమిల్లి రాజేష్ మాట్లాడుతూ అమెరికాలో చిన్నారులకు బడి, ఆటలు ఇతర వ్యాపకాల మధ్య ఇటువంటి కళల కోసం వెచ్చించడానికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది. అటువంటి వాతావరణానికి అనువుగా తానా మరియు పద్మావతి కళాశాల ఎంతో సమయం వెచ్చించి వారికి అర్థమయ్యే విధంగా చక్కని సిలబస్ తయారు చేయడం జరిగింది. దీని వల్ల నేర్చుకునే విద్యార్థులకి అలాగే వారి గురువులకి ఒక క్రమ పద్దతిలో కళలు నేర్పించడానికి, నేర్చుకున్న విద్య యొక్క ప్రామాణికతను ప్రతి సంవత్సరం పరీక్షల ద్వారా తెలుసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటోందని వివరించారు.
2021-2022 సంవత్సరానికి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. క్రింది లింక్ ద్వారా దరఖాస్తు ఫారం ని పూర్తి చేసి ఈ కోర్సులలో చేరవచ్చు. అదే లింక్ లో ఈ కోర్సుకి సంబందించిన ఇతర వివరాలు కూడా ఉంటాయి.
ఈ కోర్సు లో రిజిస్టర్ అవ్వడానికి ఆఖరు తేదీ నవంబర్ 30.
మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించవలసిన ఇమెయిల్ kalasala@tana.org
ఫోన్ నెంబర్ 856-281-1377