అమెరికా సుప్రీం కోర్టులో కరోనా తెచ్చిన మార్పు
కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచ సమాజంలో అనేక మార్పులకు కారణమవుతోంది. సాంప్రదాయ విధానాలను అనుసరిస్తున్న అమెరికాలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కూడా తప్పని పరిస్థితుల్లో మార్పులను తీసుకురావాల్సి వస్తోంది. ఈ వారం నుంచే కోర్టులోని న్యాయమూర్తులు టెలీఫోన్ ద్వారా వాదనలను విననున్నారు. అలెగ్జాండర్ గ్రహంబెల్ తాను ఆవిష్కరించిన టెలీఫోన్కు 1876లో పేటెంట్ పొందారు. అప్పటి నుంచి తొలిసారిగా ఫోన్ ద్వారా విచారణ జరగనుండటం విశేషం. అంతేకాకుండా వాదనలకు సంబంధించిన ఆడియోను న్యూస్ మీడియా ద్వారా లైవ్‌గా ప్రసారం చేయనున్నారు. ఇది కూడా మొదటి విచారణ జరగనుంది.






