పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన టాటా
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. చర్లపల్లి, బిఎన్ రెడ్డి నగర్లో ఉన్న దాదాపు 150 కుటుంబాలకు ఈ వస్తువులను అందించినట్లు టాటా నాయకులు తెలిపారు. వలంటీర్ల సహకారంతో భౌతిక దూరం పాటిస్తూ అందరికీ నిత్యావసర వస్తువులను అందించామని, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, వలంటీర్లకు వారు ధన్యవాదాలు చెప్పారు. సాయికన్నా, మోహన్ కన్నా, మల్లారెడ్డి, శ్రీనివాస్, సుధాకర్, సోమ్నాథ్, సబిత, సుచరిత, స్వప్న, పమేల, లక్ష్మీ, హర్షిత, నిఖిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని, మరో విడత కూడా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టాటా నాయకులు తెలిపారు.






