మనిషి మనిషిగా మారేందుకు… ప్రకృతి సంధించిన అస్త్రం ‘కరోనా’
కొరోనా వైరస్ వ్యాధి (కోవిడ్ -19)..
దీంతో ప్రపంచము అంతమై పోతుందా… మానవజాతి సర్వనాశనం అవుతుందా! ఈ భూమ్మిమీద మనిషికి మనుగడే లేదా ..ఆయన మనం బతకాలి . ‘2012’ అనే పేరుతో వచ్చిన ఇంగ్లీష్ సినిమాలో ప్రపంచము అంతమైయిపోతున్న బతికేందుకు కొంతమంది ఆరాటపడి దానికోసం సర్వం వదులుకొని పరుగులు తీసినట్లుగా మనం కూడా కొరోనా వైరస్న ను తపించుకునే బతకాలి, మిగిలిన వారు ఎలా పోయిన పర్వాలేదు …. ఇలా ఉన్నాయి, ఎక్కువ మంది ఆలోచనలు.
కానీ నాకెందుకో భిన్నమైన దృష్టి కోణం కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాధి ఇవాళ కాకపోతే రేపటికైనా తగ్గుముఖం పడుతుంది. కొందరు అనుకున్నట్లు ప్రపంచం ఏమీ అంతమై పోదులేండి… కానీ వ్యాధి కనుమరుగైన తర్వాత కొంత ప్రపంచం ఆవిష్కృతం అవుతుందనిపిస్తోంది. మహాకవి శ్రీశ్రీ అన్నారే… మరోప్రపంచం… మరోప్రపంచం- అని, అలాంటివి వస్తుందేమో. కొత్త బంగారు లోకం అన్నమాట.
కొత్త బంగారు లోకం ఎలా ఉంటుంది? : అత్యాశ మానవజాతిని నాశనం చేస్తోంది. పర్యావరణ హననం కూడా ఆకోవలోనిదే. డబ్బు… అధికారం…..దీనివెనుక మనుషులు పరుగులు తీస్తున్నారు. వ్యక్తులు, సంస్థలు దేశాలు… చేసే మంచైనా, చెడైనా – ఒక లక్ష్యం కోసం అయితే కాదు, స్వార్థపు ఆలోచనలతోనే. మనిషిని మనిషి చంపుకోవటం అయినా, కొత్తకొత్త టెక్నాలజీలను ఆవిష్కరిచటం అయినా డబ్బు కోసమే. మనిషి ప్రాణం కంటే డబ్బే ఎక్కువైపోయినప్పుడు ఇటువంటివే… కరోనా వైరస్ వంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయి. మనిషిలోని ఈ అత్యాశ తొలగిపోయినప్పుడే మానవజాతి మనుగడ సాధించగలుగుతుంది.
ఆ మార్పు రావాలి… అందుకు కరోనా వైరస్ దోహదపడుతోందనేది నా విశ్వాసం.
కరోనా వైరస్ వ్యాధి విస్తరణను అడ్డుకోవటానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో మనకు ఎన్నో కొత్త విషయాలు తెలిసివస్తున్నాయి. షేహ్యాండకు బదులు నమస్తే, సామాజిక దూరం, పరిశుభ్రంగా ఉండటం, క్రమశిక్షణ పాటించటం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు వికసించటం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవటం – ఇవన్నీ ఎంతో సంతోషకరమైన అంశాలే కదా.
ఇంకా ఇటువంటి మంచి మార్పులెన్నో రావాలి. వస్తాయనే నా ఆశ. ఎలాంటివంటే…..
* మనిషి తెలివితేటలను మించిన పెద్ద శక్తి ఏదో ఉందని విశ్వశిస్తే…..
* మనల్ని మనం మార్పుకునేందుకు, మనకు ఏది ముఖ్యమో చెప్పేందుకే కరోనా వైరస్ వంటి ఉపద్రవం వచ్చిందని అనుకుంటే…
* కుటుంబంతో అనుబంధాన్ని బలపరిచేందుకు, రోజూ పరుగులు తీస్తున్న మనం… ఒక క్షణం ఆగి మనల్ని మనం తెలుసుకునేందుకు ఒక అవకాశం ఈ రూపంలో వచ్చిందేమోనని అనిపిస్తోంది .
* ప్రయాణాలు ఆగిపోయాయి… గాలి, పొగ, దుమ్మూ ధూళి తగ్గి ఆకాశం తేటబారిందే. మనం పీల్చే గాలి బాగుందే. ఇంట్లో టేబుల్ మీద, కారు డిక్కీ మీద దుమ్ము పేరుకోవటం లేదే! పంజాబ్లోని అమృతసర్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయాలు దాదాపు నలభై ఏళ్ల తర్వాత మళ్లీ ఎలా కనిపిస్తున్నాయి! కాలుష్యం తగ్గటంతోనే కదా. అంటే మనం ఈ అందమైన భూమండలాన్ని ఇన్నాళ్లూ ఎందుకు పనికిరానిదిగా, సర్వనాశనం చేసి పెట్టామన్నమాట. అదే ఇప్పుడు తెలుస్తోంది.
* పని లేకపోతే బతకటం ఎంత కష్టం… ఇప్పుడు అర్ధమవుతోంది కదా. పది కోట్ల మంది కార్మికులు రోడ్ల మీద జీవిస్తున్నారు. సొంతూరు వెళ్లి కల్లో గంజో తాగే అవకాశం కూడా లేదు. మధ్యతరగతి జనం ఈఎంఐ ఎలా కట్టాలి, ఇంటి అద్దె కోసం ఓనర్ ఎప్పుడు ఫోన్ చేస్తాడేమోనని భయపడిపోతున్నారు. క్రెడిట్ కార్డు పేమెంట్ కట్టాలి , జీవితం అంటే పోరాటం, కాలక్షేపం కాదు… అని ఇప్పుడు అర్ధమవుతుందా?
* మన ప్రధాని మోడీ గారు ‘స్వచ్ఛభారత్ నిర్మించండి బాబో… అంటే మనం పట్టించుకోం. అంతకు ముందు ఎన్నడో… ఒక నాయకుడు క్లీన్ అండ్ గ్రీన్ అన్నాడు. అయినా మనం వినలే. కానీ ఇప్పుడు మాత్రం గంటకోసారి చేతులు తెగ కడుగుతున్నాం. ఎవరూ ఒత్తిడి చేయలేదే. పరిసరాలు శుభ్రముగా , అపార్టుమెంట్లు డీశానిటైజషన్ చేసుకుంటున్నారు , అయినా ఎందుకు చేస్తున్నాం. ప్రాణభయం. ఏమైతేనేం. – స్వచ్చ భారత్ ఇలాగైనా చేస్తున్నాం. మంచిదే.
* మళ్లీ మన నమస్తేకు గుర్తింపు వచ్చింది. డోనాల్డ్ ట్రంప్ నుంచి యూకే ప్రిన్స్ రాఫెస్ వరకూ అందరూ నమస్తే అంటున్నారు.
* ఆరోగ్యమే మహాభాగ్యం. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్ల గోడల మీద రాసి ఉండే సూక్తి అదే నిలుమైన ఆస్తి అని ఇప్పుడు అందరికి అర్థమవుతోంది. ఇన్నాళ్లూ డబ్బు వెనక, బండ్లు, భూములు, బిల్లింగులు… అని పరుగులు తీసిన మనిషికి ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా ఏం చేసుకుంటాం అనేధైతే అర్ధమైంది.ఇంటిలో వుండి కమ్మని వంటలు తింటే అంతా మంచిగా ఉంటుంది.
* మనిషి జీవితానికి అర్థం ఏమిటి? ఇది ఎన్నో ఏళ్లుగా మానవ జాతిని వేధిస్తున్న ప్రశ్న. పుట్టటం, తినటం, తప్పులు చేయటం, అసూయ- ఈ రాద్వేషాలతో రగిలిపోవటం, చివరికి వయసు మీదపడి చనిపోవటం- ఇదేనా జీవితం అంటే.. జీవితం అంటే తెలుసుకోవటం. విజ్ఞానాన్ని సముపార్జించటం, ఈ విజ్ఞానాన్ని మన తర్వాతి తరానికి అందించటం – ఇదే మనిషి జీవితానికి నిజమైన అర్ధం. విజ్ఞానార్జనే సంతోషం, సంతృప్తి కలిగించేంది.. ఆదర్శప్రాయమైది. దీన్ని మనిషి గ్రహించేందుకు కరోనా వైరస్ ఒక అవకాశాన్ని ఇచ్చింది. విజ్ఞాన సముపార్జనకు ప్రధాన మార్గం అధ్యయనం. చదువు, తెలుసుకో. అదే ఇప్పుడు ఎక్కువ మంది చేస్తున్నారు. కరోనా ‘లాక్ డౌన్ తో ఇళ్లలో కూర్చున్న వారిలో ఎంతో మంది రోజుకో పుస్తకం చదువుతూ, కొత్త విషయాలను తెలుసుకంటూ తమను తాము అర్ధం చేసుకుంటూ, ప్రపంచాన్ని కొత్తగా చూస్తూ కాలం గడువుతున్నారు. పుస్తక పరం మళ్లీ మనిషికి దగ్గరవుతోంది. ఇది మంచి మార్పు కదా.
* మనం స్కూలుకు టైముకు వెళ్లం. ఆఫీసుకు ఆలస్యం సర్వసాధారణం. పనికి టైమ్ కు వెళ్లటం అనేది ఉండనే ఉండదు. ఏరోజు మన నాయకులూ టైం వచ్చి మీటింగ్లు చెప్పారు , మనకు ఒక సామెత వుంది ” రెడ్దొచ్చె మొదలెట్టు”. అసలు క్రమశిక్షణకు పరమ వ్యతిరేకం. ఎవరేం చెప్పినా, ఇదిగో రూల్… పాటించు. అంటే… దాన్ని వ్యతిరేకించటానికి సవాలక్ష మార్గాలు వెతుకుతాం. కానీ ఇప్పుడో క్రమశిక్షణగా ఉండటం మనకు అలవాటైంది. ఎవరినైనా కలిస్తే కరోనా వస్తుందేమోనని, రోడ్డు మీదకు వెళ్తే పోలీసులు కొడతారు అని , పట్టుకుంటారని ఇంట్లో నుంచి అడగు బయట పెట్టటం లేదు. టైమ్ కు లేస్తున్నాం, పని మనిషి లేదు కాబట్టి చక్కగా ఇళ్లు తుడుచుకొని, గిన్నెలు కడుక్కొని, బట్టలు ఉతుక్కొని, వేళకు తిని పడుకుంటున్నాం. ఇంతకు ముందు ఎక్కడి వస్తువులు అక్కడ పడవేసి, వంట పాత్రలు సింక్ లో విసిరేసి, బట్టలు బాత్ రూమ్ లో చిందర వందరగా పడేసి- పనిమనిషి వచ్చి చూసుకుంటుందిలే, అనుకుంటూ- మనకేదే అంతకు మించిన ముఖ్యమైన పనులు ఉన్నట్లు హడావుడిగా తిరిగేవాళ్లం. ఇప్పుడు అర్ధమవుతోంది. అదంతా వట్టి కాలక్షేపమేనని. మన పనులు మనం చేసుకుంటే ఎంతో శుబ్రంగా, బాగా ఉంటుందని తెలిసివస్తోంది. అంటే మనం క్రమశిక్షణ పాటిస్తున్నాం, క్రమశిక్షణగా తయారవుతున్నాం. సో… థాంక్యూ, కరోనా.
* చెడ్డ ఆలోచన దినంత ప్రమాదకరమైనది లేదు. ఇది ఆటం బాంబు కంటే డేంజరస్. ఒక మనిషికి చెడు ఆలోచన రానే కూడదు. వచ్చిందంటే అంతకంటే ముప్పు మరొకటి ఉండదు. ప్రస్తుత సమాజంలో మనలో ఎక్కువ మంది చెడ్డ ఆలోచనలతోనే సాగుతున్నాం. ఈ భూమండలంలో, ఈ ప్రపంచంలో మనుషులలో నేడున్నంత చెడు ఆలోచన, దుర్బుద్ధి గతంలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు. కలియుగం వస్తోంది, మనిషిలో అత్యాశ కనిపిస్తోంది, చెడు శకునాలు గోచరిస్తున్నాయి. అని మహాభారత యుద్ధానంతరం తాను కూడా తనువు చాలించే సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అన్నట్లుగా, మానవాళి ఈ జగత్తులో దుష్ట ఆలోచనలతోనే కాలం గడుపుతోందనటానికి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. దాని స్థానంలో మంచి ఆలోచనలు వచ్చేందుకు, మనిషి. మళ్లీ మానవత్వాన్ని సంతరించుకొని మనిషిగా మారేందుకు కరోనా వైరస్ వ్యాధి రూపంలో ఒక అవకాశం వచ్చినట్లు అనిపించటం లేదు. సానుకూల దృక్పథం మానవాళికి మేలు చేస్తుంది. సంతోషాన్ని నింపుతుంది. భవిష్యత్తుపై ఆశలు పెంచుతుంది. ఎదుటివాడి మీద పడి ఏడ్ని, బాధపడి, అసూయతో రగిలిపోయి సాధించేది లేదు. నిన్ను నీవు ప్రేమించి, నిన్ను నమ్ముకున్న వాళ్లని, నీ చూట్టూ ఉన్న వాళ్లని సంతోషపెట్టు. నీ ద్వారా మధురమైన స్కృతులు వారిలో మిగిలిపోయేటట్లు, నీవొక తీయన జ్ఞాపకంగా లాగా వారి మదిలో ఉండిపోయేటట్లు వ్యవహరించు. నీ గురించి ఒక ఆలోచనే వారి మనసును సంతోషంతో నిండిపోయేటట్లు ప్రవర్తించు. ఇంతకంటే మానవత్వం ఏముంటుంది. ఇప్పుడు మన అందరమూ కుటుంబముతో మన తీపి జ్ఞాపకాలుతో గడుపుతున్నాము. ఇదంతా కరోనా మహిమే …
ఇవన్నీ చూస్తుంటే, ఏమనిపిస్తోంది. ఛార్లెస్ డార్విన్ చెప్పిన పరిణామక్రమాం సిద్ధాంతంలో (థియరీ అఫ్ ఎవల్యూషన్) కరోనా వైరస్ ఒక భాగమేనని అనిపిస్తుంది. అదుపు తప్పిన మనిషిని కట్టడి చేసేందుకు ప్రకృతి విసిరినా బ్రహ్మాస్త్రమని అనిపిస్తుంది. ఏదైతేనేం… సమాజంలో మనకు తెలీకుండానే మార్పు వస్తోంది. ఈ మార్చే నేను, మీరు కోరుకుంటున్నది, రావాలని ఆశపడుతున్నది.
ఎల్. మారుతీ శంకర్, ఎండీ
7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్
98494 55777






