ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ : ట్రంప్
ఈ ఏడాది చివరి కల్లా కచ్చితంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. 2021 సంవత్సరం రాక ముందే అమెరికాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. వ్యాక్సిన్ వస్తుందన్న అంశంలో నమ్మకంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. లింకన్ మెమోరియల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారీలో సైంటిస్టులు నిమగ్నమై ఉన్నారు. అయితే ఆ వ్యాక్సిన్లు మాత్రం 2012 మధ్య కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. డాక్టర్ల లెక్క ప్రకారం వ్యాక్సిన్ తొందర్లోనే వస్తుందని ట్రంప్ సృష్టం చేశారు.






