అమెరికాలో తీవ్ర నిరసనలు
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్లపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లకు సైతం వ్యతిరేకత తప్పడం లేదు. ఈ విషయాన్ని వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ డెబోరహ బిర్క్స్ తెలిపారు. ఈ నిరసనలను వినాశకరమైన ఆందోళనగా ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానుల్లో సాధారణ జీవనం కోసం నిబంధనలను సడలించాలనే డిమాండ్లతో నిరసనలు చేస్తున్నారని చెప్పారు. అయితే నిరసనలు దిగుతున్నవారు ఎలాంటి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయడం లేదన్నారు.
ఇలాంటి వారు కరోనా వైరస్‌కు అనుకూలంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ప్రతీ ఒక్కరీ రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉందని అని చెప్పారు. స్టే ఎట్ హోం ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థను పున ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. మిచిగన్‌లో లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ భారీ నిరసన జరిగింది. రాష్ట్ర రాజధాని లన్సింగ్‌లో వందాలది మంది ఆందోళనకారులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో కొంత మంది ఆయుధాలను కూడా ధరించి రావడం ఆందోళనను కలిగించింది. నిరసనకారులు లెజిస్లేటివ్ భవనంలోకి దూసుకొవెళ్లడానికి ప్రయత్నించారు.






