Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Community » Usa Nri News » 17th ata conference and youth convention a grand success

అంగ రంగ వైభవంగా… అతి పెద్ద కన్వెన్షన్ నిర్వహించిన ఆటా

  • Published By: techteam
  • July 16, 2022 / 05:51 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
17th Ata Conference And Youth Convention A Grand Success

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్‌ డీసీ నగరం తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్‌ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. కోవిడ్‌ మహమ్మారి తర్వాత నిర్వహించిన భారీ మొదటి తెలుగు మహాసభలు కావటం మరియు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ఈ సభ ఎంతో వ్యయ ప్రయాసలకు వెరవకుండా నిర్వహించటం విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ పాల్గొన్న ఈ కార్యక్రమంలో 15,000 మందికి పైగా పాల్గొనటం ఒక విశేషం. తమన్‌, ఇళయరాజా సంగీత కచేరిలు కాన్ఫరెన్స్‌లో హైలైట్‌గా నిలిచాయి.

Telugu Times Custom Ads

జులై 1వ తారీఖున నిర్వహించిన బాంక్వేట్‌ డిన్నర్‌ లో 3000 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ ఆటా అవార్డ్స్‌ ప్రదానం చేసారు. క్రికెట్‌ దిగ్గజాలు కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, క్రిస్‌ గేల్‌ తదితరులు ఈ బాంక్వేట్‌ డిన్నర్‌ లో పాల్గొన్నారు, వీరిని ఆటా ఘనంగా సత్కరించింది. అదే రోజు నిర్వహించిన గోల్ఫ్‌ టోర్నమెంట్‌ లో కపిల్‌ దేవ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ పాల్గొన్నారు. 125 మందితో స్వాగతోత్సవ జానపద సంబరాలు ‘‘మన ఆటా జానపదాల కోట’’ నిర్వహించారు. 140 మందికి పైగా పాల్గొన్న ‘‘తెలుగు మన వెలుగు’’ కార్యక్రమంలో కూచిపూడి, గోండి, లంబాడి తదితర సంప్రదాయ నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మన బడి బాలలు చేసిన శ్రీ కృష్ణ రాయబారం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. బతుకమ్మ పైన ఆటా ముద్రించిన పుస్తకాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వద్దిపర్తి పద్మాకర్‌ గారు నిర్వహించిన అవధానం ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకున్నది. శివమణి, థమన్‌ మ్యూజికల్‌ నైట్‌ శ్రోతలను ఉర్రుతలు గించింది. డ్రమ్స్‌ పైన శివమణి చేసిన విన్యాసం ఆబాలగోపాలాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఉపాసన కామినేని సద్గురుకి వినూత్నమైన ప్రశ్నలు శ్రోతల తరపున అడిగారు. సద్గురు మాట్లాడుతూ పర్యావరణ ముప్పుని నివారించటానికి సారవంతమైన భూమిని ఎలా కాపాడుకోవాలో, ఆహార భద్రతకు దీని ఆవశ్యకత, ఎంత ప్రాముఖ్యం సంతరించుకుందో సోదాహరణంగా ‘‘సేవ్‌ ది సాయిల్‌’’ ప్రోగ్రాం గురించి వివరించారు. ఈ సభలకు మగ్దూం సయ్యద్‌, రవి రాక్లే, సింగర్‌ సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మహిళలు, పిన్నలు పెద్దలు సాంప్రదాయ దుస్తులను ధరించి సందడి చేసారు.

జులై 3వ తారీఖున ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లోక కళ్యాణం కోసం నిర్వహించిన శ్రీనివాస్‌ కళ్యాణం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదాలు అందుకున్నారు. ఆటా బ్యూటీ పేజంట్‌ విజేతలకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అడివి శేష్‌ బహుమతులు అందచేశారు. అమెరికాలో 12 నగరాల నుంచి ఔత్సాహికులు పాల్గొనటం విశేషం. రaుమ్మంది నాదం పాటల పోటీలలో మరియు సయ్యంది పాదం నాట్య పోటీలలో పాల్గొన్న మూడు వందలమందిలో నుండి విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందచేశారు.

బిజినెస్‌ కమిటీ నిర్వహించిన ఎంట్రప్రెనేయూర్షిప్‌ అండ్‌ లైఫ్‌ సైకిల్‌ కార్యక్రమంలో జిఎంఆర్‌ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ సదస్సులో ఉపాసన కామినేని పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి పై నిర్వహించిన సదస్సులో తనికెళ్ళ భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహాసభలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్ల రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి, గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్‌, గాదారి కిశోర్‌, వైజాగ్‌ పార్లమెంట్‌ సభ్యులు %వీపప% సత్యనారాయణ, రాజమండ్రి శషన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌధరి మరియు ఇతర నాయకులు భాను ప్రకాష్‌ రెడ్డి, పటేల్‌ రమేశ్‌ రెడ్డి, భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర మిషన్‌ ధ్యాన గురువు కమలేష్‌ పటేల్‌ (దాజి) ప్రత్యేక సందేశం అందించారు. ఈ మహాసభల నిర్వహణకు విరాళాలను అందచేసిన దాతలను ఆటా కార్యవర్గం ఘనంగా సత్కరించింది.

మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అంధరిని మైమరిపించి మధురానుభూతులను అందించింది. గురువందనతో సంగీత విభావరి ప్రారంభమై ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్‌ లాంటి ప్రముఖ గాయని గాయకులు అంధింస్తు సంగీతాల రaురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

ఆటా ప్రెసిడెంట్‌ భువనేశ్‌ బుజాల మాట్లాడుతూ ఆటా కార్యవర్గం తనపై ఉంచిన గురుతర బాధ్యతలకు ఎంతో రుణపడి ఉంటాను అని ఉటంకించారు. అమెరికాలో తెలుగు వారి చరిత్రలో నభూతో నభవిష్యతిగా ఈ మహా సభలు నిర్వహించటానికి తోడ్పాటు అందించిన కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు, కోఆర్డినేటర్‌ కిరణ్‌ పాశం తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. కోర్‌ కమిటీ, ఆడ్‌ హాక్‌ కమిటీ, కాట్స్‌ టీం, వాలంటీర్స్‌ విశేష కృషి మూలంగానే ఇంతటి ఘనంగా నిర్వహించగలిగామని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేశారు. ఆటా ఫౌండిరగ్‌ మెంబర్‌ హనుమంత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రెసిడెంట్‌ అండ్‌ టీం యొక్క కార్యాధ్యక్షత మూలంగానే ఇంత ఘనంగా ఈ మహాసభలు నిర్వహించగలిగామని కొనియాడారు. వేండొర్‌ బూత్స్‌ ఒక మినీ షాపింగ్‌ మాల్‌ ని తలపించాయి. ఆటా సంప్రదాయ దుస్తులలో రిజిస్ట్రేషన్‌ వాలంటీర్స్‌ ఎరుపు రంగు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మీడియా మిత్రులకు, ప్రకటనకర్తలు వాలంటీర్స్‌, సహకరించిన ప్రతి ఒక్కరికి అట కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు, కోఆర్డినేటర్‌ కిరణ్‌ పాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఆటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు సెక్రటరీ హరి ప్రసాద్‌ రెడ్డి లింగాల, ట్రెఅసురేర్‌ సాయినాథ్‌ రెడ్డి బోయపల్లి, జాయింట్‌ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్‌ ట్రెజరర్‌ విజయ్‌ కుందూరు కాన్ఫరెన్స్‌ విజయానికి ఎంతో తోడ్పాటుని అందించిన కోహోస్టు కాపిటల్‌ ఏరియా తెలుగు సొసైటీ సబ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు.

అలరించిన సద్గురు ప్రసంగం

ఆటాలో ముఖ్య కార్యక్రమాల్లో ఒకటైన సద్గురు జగ్గి వాసుదేవ్‌ ప్రసంగం అందరినీ ఎంతగానో అలరించింది. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే నష్టాలను నిర్వహించడానికి మట్టిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆటా ఆధ్వర్యంలో డీసీలో ప్రవాస తెలుగువారితో కలిసే అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

స్టాన్లీ ఇంజనీరింగ్‌ కాలేజీ చైర్మన్‌ కృష్ణారావుకు సన్మానం

హైదరాబాద్‌లోని ప్రముఖ స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్‌ కాలేజీ చైర్మన్‌ కృష్ణారావును అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఘనంగా సత్కరించింది. అమెరికాలో జరుగుతున్న ఆటా సభల్లో ప్రతినిధులతో పాటు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌, విశాఖ ఎంపీ కృష్ణారావును సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు కృష్ణారావు విద్యావేత్తగా, పారిశ్రామికవేత్తగా అందిస్తున్న సేవలను కొనియాడారు.

చరిత్ర సృష్టించాలన్నా మనమే.. దాన్ని తిరగరాయాలన్నా మనమే

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాల్లో ఒకటిగా, ఘనమైన చరిత్ర ఉన్న అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ (ఆటా) అమెరికాలోని తెలుగువారికి దశాబ్దాలుగా సేవలందిస్తూ, వారి ఆదరణను ఆప్యాయతలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.  మూడు దశాబ్దాలలో మరిచిపోలేని ఎన్నో విజయాలు నమోదు చేసిన ఆటా.. జులై 1-3 తేదీల్లో వాషింగ్టన్‌ డీసీ వేదికగా జరిగిన కన్వెన్షన్‌తో కొత్త చరిత్రను సృష్టించింది. మునుపెన్నడు లేని రీతిలో అమెరికా రాజధాని వేదికగా ఒక భారీ తెలుగు ప్రభంజనాన్ని సృష్టించినందుకు ఆటా గర్వపడుతోందని ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బుజాల, కన్వీనర్‌ సుధీర్‌ బండారు, కో ఆర్డినేటర్‌ కిరణ్‌ పాశం తెలిపారు.

కరోనా సృష్టించిన కల్లోలం ఒకవైపు, అమెరికా వ్యాప్తంగా ద్రవ్యోల్భణ సూచనలు మరో వైపు.. అయినా ఆటా మీద అభిమానంతో వేలాది మంది ప్రవాసాంధ్రులు కన్వెన్షన్‌ కోసం కుటుంబాలతో సహా తరలివచ్చారు. తెలుగు కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా అత్యంత ఆడంబరంగా జరిగిన వేడుకల్లో పాల్గొని కన్వెన్షన్‌ను విజయవంతం చేసారు.  ప్రతికూల పరిస్థితుల్లో ఇంతటి భారీ స్థాయిలో కన్వెన్షన్‌ నిర్వహించడం సాధారణ విషయం కాదు. 15వేల మంది తెలుగు ప్రజలను ఒక్కతాటి పైకి చేర్చి పండుగ చేయడం మామూలు విషయం అంతకన్నా కాదు. అందరి సహకారం, మద్ధతు వల్లే ఈ ఘన విజయం సాధ్యమయింది. ఈ గొప్ప కార్యక్రమంలో భాగమైన దాతలు, కార్పోరేట్‌ స్పాన్సర్లు, సభ్యులు.. ప్రతీ ఒక్కరికి ఆటా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసింది.

అమెరికా గడ్డపై ఇంతటి మహా కన్వెన్షన్‌ను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. పోటెత్తిన తెలుగు అభిమానానికి ఇది నిదర్శనం. ఆటా కార్యవర్గ సభ్యులు, ట్రస్టీలు, ఆఫీసు బేరర్లు, అడ్వైజరీ కమిటీలు.. అందరి తరపున ఈ కాన్ఫరెన్స్‌ను విజయవంతం చేసిన అందరికీ, కొండంత అండగా మీరు అందించిన మద్ధతు, ఆటా పట్ల మీ ప్రేమాభిమానాలకు ఆటా కార్యవర్గం ఎప్పుటికీ రుణపడి ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.

 

Tags
  • ATA Conference
  • Washington DC
  • Youth Convention

Related News

  • Potluri Ravi Helps Student K Eranna For Higher Education

    TANA: విద్యార్థి ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం…

  • Nats Felicitates Damu Gadela

    NATS: దాము గేదెల కు నాట్స్ సత్కారం…

  • Adoption Of Highways In America Under Tana Mid Atlantic

    TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్-ఎ-హైవే’ విజయవంతం

  • Nats Online Yoga Workshop By Maittreyi

    NATS: నాట్స్ ఆధ్వర్యంలో ఫ్రీ యోగా, మెడిటేషన్ వర్క్‌షాప్

  • Tana Backpack Distribution In New Jersey

    TANA: న్యూజెర్సీ లో తానా బ్యాక్ ప్యాక్ వితరణ – ఫ్రీహొల్డ్ బరో స్కూల్ లో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

  • Trump Administration Plans Significant H 1b Visa Changes

    H1B Visa: హెచ్1బీ వీసాలపై యూఎస్ ఫోకస్.. అమెరికన్లకు అన్యాయం జరిగితే ఊరుకోం!

Latest News
  • Nepal: నేపాల్ కల్లోలానికి బాధ్యులెవరు..? హిమాలయదేశం ఎటు వెళ్తోంది..?
  • CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..
  • Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..
  • NBK: ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ
  • France: అంతర్గత సంక్షోభంలో ఫ్రాన్స్… మాక్రాన్ కు వ్యతిరేకంగా వీధుల్లోకి ప్రజలు..
  • Chiru-Puri: మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన పూరి-విజయ్ సేతుపతి టీం
  • Washington: రష్యాకు వ్యతిరేకంగా ఈయూను కూడగడుతున్న ట్రంప్..
  • Bellamkonda Sai Sreenivas: యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది – సాయి శ్రీనివాస్
  • Mohan Lal: దోశ కింగ్ గా మోహ‌న్ లాల్
  • Rayalaseema: సీమపై స్పెషల్ ఫోకస్..!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer