Vijay Devarakonda: వివాదంపై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ
రెట్రో(Retro) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా వచ్చిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) ఆ ఈవెంట్ లో చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. విజయ్ వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ విషయంపై విజయ్ రెస్పాండ్ అయి క్లారిటీ ఇచ్చాడు.
రెట్రో ఆడియో లాంచ్ ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలు కొంతమంది ప్రజల్లో ఆందోళన కలిగించాయని తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో తాను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుపుతూ ఓ నోట్ ను రిలీజ్ చేశాడు విజయ్ దేవరకొండ. తాను చేసిన వ్యాఖ్యల ద్వారా మన షెడ్యూల్డ్ తెగలను హర్ట్ చేయడం తన ఉద్దేశం కాదని, వారిని తానెంతో గౌరవిస్తానని చెప్పాడు విజయ్.
తాను కేవలం ఐక్యత గురించి మాత్రమే మాట్లాడానని, దేశం మొత్తం ఒకటేనని, అందరం కలిసి ముందు ఎలా సాగాలనే దాని గురించి చెప్పానని అందరినీ తాను కుటుంబంలాగా, బ్రదర్స్ లానే చూస్తానని చెప్పిన విజయ్, ఒకవేళ తన మెసేజ్‌లో ఏదైనా తప్పు ఉండి, దాని వల్ల ఎవరైనా బాధ పడితే దానికి తాను హృదయపూర్వక క్షమాపణలను తెలియచేస్తున్నట్టు విజయ్ రాసుకొచ్చాడు.






