Suriya Kanguva OTT update: అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తున్న సూర్య కంగువా.. ఎక్కడో తెలుసా?

ఓటీటీ లో మూవీ చూస్తున్న సినీ లవర్స్ సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతుంది. దీంతో ఆ సదరు సంస్థలు కూడా కొత్త చిత్రాలను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇక వీకెండ్ వస్తుంది అంటే ఏదో ఒక కొత్త సినిమా ఓటీటీ లో సందడి చేయాల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరో సూర్య నటించిన కంగువా(Kanguva )చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి ఓటీటీ లో రాబోతోంది. ఇంతకీ మూవీ ఎక్కడ? ఎప్పుడు? స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం..
భారీ అంచనాల మధ్య తమిళ్ స్టార్ హీరో సూర్య (Suriya) హీరోగా తెరకెక్కించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువా. హైటెక్నాలజీ తో.. అంతరించిపోయిన ఎన్నో సంవత్సరాల క్రితం కథను నేటి తరానికి జతచేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. మిశ్రమ స్పందన అందుకోవడంతో థియేటర్లలో కలెక్షన్స్ ఊహించిన రీతిలో రాలేదు.
ఫస్ట్ షో నుంచి ఈ చిత్రానికి బ్యాడ్ పబ్లిసిటీ రావడంతో మొదటి వారంలోని చిత్రం థియేటర్ రన్ ముగిసిపోయింది. 400 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ తమిళ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ స్లో ఒకటిగా మిగిలింది. ఇక విడుదలకు ముందు ఈ మూవీకి సంబంధించి హైప్ భారీగా ఉంది.. దీంతో ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ దరకు దక్కించుకుంది. ఇక ఇప్పుడు థియేటర్లో చిత్రం ఫ్లాప్ కావడంతో అనుకున్న టైం కంటే ముందుగానే ఈ చిత్రాన్ని ఆన్లైన్ స్ట్రీమింగ్ కి తీసుకురావడానికి అన్ని రెడీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 13న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన తర్వాత సౌండింగ్, రన్ టైం విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. రన్ టైంలో తగ్గించి.. సౌండ్ లో మార్పులు చేర్పులు చేసినప్పటికీ రెస్పాన్స్ అనుకున్న రీతిలో రాలేదు. థియేటర్లలో ఫెయిల్ అయిన ఎన్నో చిత్రాలు ఆ తర్వాత ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకొని ట్రెండింగ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా అదే రకంగా ఆన్లైన్ ప్రేక్షకులను మెప్పించి ఓటీటీ గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.