పుష్ప-2 ది రూల్ డిసెంబర్ 5 నుండి రికార్డుల వైల్డ్ ఫైర్

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. అల్లు అర్జున్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో, సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఇది. డిసెంబరు 5న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్‌లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్.
ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను నెలకొ ల్పింది. అయితే ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం భారతదేశం లోని సినీ ప్రేమికులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నయ్, కొచ్చిలలో వైభవంగా నిర్వహించారు. ఇంకా కలకత్తా, బెంగళూరు, ముంబయ్, హైదరాబాద్ లలో ఈవెంట్స్ జరుపనున్నారు.
నవంబరు 17న పాట్నాలో…
నవంబరు 17న పాట్నాలో జరిగిన ఈవెంట్‌కి జనసంద్రంతో.. ఉప్పొంగిన జనవాహినిగా మూడు లక్షల అల్లు అర్జున్ అభిమానులు హాజరయ్యారు. పుష్ప-1లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్… నీయవ్వ తగ్గేదేలే.. పుష్ప ది రైజ్‌లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చెప్పిన ఈ మాసివ్ డైలాగులు ఆకట్టుకున్నాయో లేదా పాటలు అలరించాయో కాని, పాట్నా ఫంక్షన్ సూపర్‌హిట్ అయ్యింది. ‘‘నమస్తే.. బీహార్ ప్రజలందరికీ నా నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు పాట్నా వచ్చినా మీరు చూపించే ప్రేమ, ఇచ్చే ఘన స్వాగతానికి పాట్నా అభిమానులందరికీ ధన్యవాదాలు. మీరు ఈ సినిమాపై చూపించిన ప్రేమకు థ్యాంక్యూ. ఇది నా గొప్పతనం కాదు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ఈ సందర్భంగా పుష్ప టీమ్ మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా.. అని అన్నారు.
చెన్నైతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్
అల్లు అర్జున్ మాట్లాడుతూ… ‘‘ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం. తమిళ ప్రజలందరికీ నా నమస్కారాలు. జీవితంలో నేను మర్చిపోలేని రోజుగా ఈరోజును నేను గుర్తుపెట్టుకుంటాను. ప్రత్యేకంగా పుష్పాకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ రావడంతో దేశంలో తిరుగుతూ ప్రమోషన్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా చెన్నైకి వచ్చినప్పుడు వచ్చే ఫీల్ వేరు. చెన్నైతో నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. నా తొలి 20 ఏళ్ల జీవితాన్ని చెన్నైలో నేను గడిపాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అతిధికి పేరుపేరునా నా ధన్యవాదాలు. నేను ఎంతగానో ఇష్టపడి చెన్నైలో ఈ ఫంక్షన్ పెట్టాలని అనుకున్నాను. నేను దుబాయ్‌కి వెళ్ళినప్పుడు అరబిక్‌లో మాట్లాడాలి, కేరళ వెళ్ళినప్పుడు మలయాళంలో మాట్లాడాలి, హిందీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడాలి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడాలి అనుకుంటాను. అది నేను ఆ నేలకి ఇచ్చే గౌరవంగా భావిస్తాను. మైత్రి మూవీస్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాను మీరు కాకుండా ఇంకా ఎవరు చేయగలిగే వారు కాదు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాతో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతి నటీనటులకు నన్ను కృతజ్ఞుణ్ణి.
నాలుగు సంవత్సరాలుగా నాతో ఈ సినిమా కోసం పని చేస్తూ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు రష్మికకు థాంక్స్. అలాగే స్పెషల్ గెస్ట్ సాంగ్ చేసిన శ్రీలీల ఈ చిత్రంలో సాంగ్ డాన్స్ చాలా బాగా చేసింది. అది మీరు స్క్రీన్పై చూస్తే అర్థమవుతుంది. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు. తమిళనాడులో ఈ సినిమాను మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. దర్శకుడు సుకుమార్ లేకపోతే పుష్ప అనే సినిమా లేదు. తనతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఒక్కసారి ఆ సినిమా నేను చేసిన తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. నా జీవితంలో అంత ఇంపాక్ట్ కలిగించిన ఒకే ఒక్క మనిషి పేరు చెప్పాలి అంటే అది కచ్చితంగా సుకుమార్ మాత్రమే. ఆయన చాలా సిన్సియర్ డైరెక్టర్. సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, ఎఫెక్ట్స్ అంటూ ప్రతి విషయంలోనూ చాలా క్లియర్‌గా సుకుమార్ ఉంటారు. ఇక నా ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి. నేను వారిని ఫాన్స్‌గా కాదు ఆర్మీ అని పిలుచుకుంటాను. మీరంటే నాకు పిచ్చి. మిమ్మల్నికపై ఇంతగా వీక్షించి దంచుకోలేదు. ఇకనుండి ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటాను. నేను కచ్చితంగా మీ అందరి అంచనాలను ఈ డిసెంబర్ 5వ తేదీన రీచ్ అవుతాం అనుకుంటున్నాను. నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పిదాలు ఉంటే నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. చిన్నపాటి తప్పులు ఉన్నా కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను భాషను గౌరవించే వ్యక్తిని. నన్ను మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏంటో నాకు తెలుసు. అలాగే మీ అంత మంచి యాంకర్ ను నేను ఇంతవరకు చూడలేదు. చాలా బాగా ఈవెంట్ ను హోస్ట్ చేశారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఈ నేలకు మరొకసారి నా ధన్యవాదాలు’’ అన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ మాట్లాడుతూ… ‘‘ఇంతటి ఆదరణ ఇచ్చిన చెన్నై ప్రజలకు నా ధన్యవాదాలు. చెర్రీ గారు చెప్పినట్లు ఇది చాలా పెద్ద సినిమా. ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు మేము ఎంతో ఆనంద పడుతున్నాము. డిసెంబర్ 5వ తేదీన ఈ చిత్రం మీ ముందుకు రానుంది. తమిళనాడులో విచిత్రంతో గొప్ప విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి మాట్లాడుతూ… ‘‘పుష్ప టు ఇండస్ట్రీ రికార్డులను రూల్ చేస్తుందని ఆశిస్తూ వున్నాము.’’ అన్నారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ… ‘‘పుష్ప 2 సినిమా విడుదలకు ముందే ఇంత ఆదరణ రావడం చాలా ఆనందాన్నిస్తుంది. ఈ చిత్రంలో సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తదితరు అంశాలు అన్ని చాలా బాగా వచ్చాయి. సినిమాను తప్పకుండా చూడండి’’ అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ మాట్లాడుతూ… ‘‘పుష్ప టీం తరఫున ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్‌ను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రెండు సంవత్సరాలకు చిత్ర బృందం ఈ సినిమాను పూర్తి చేయడానికి గనుక ఎంతగానో కష్టపడుతూ వచ్చింది. అల్లు అర్జున్ డిసెంబర్ 5 నుండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రూల్ చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
నవంబరు 27న కేరళలో
మొన్న పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్, నిన్న చెన్నైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ తో వైల్డ్ ఫైర్ ఈవెంట్స్ నిర్వహించారు మేకర్స్. ఈ రెండు ఈవెంట్స్ సినిమాపై మరింత హైప్ చేస్తూ బజ్ క్రియేట్ చేశాయి. ఏక మూడో ఈవెంట్ అల్లు అర్జున్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కేరళలో ఈవెంట్ నిర్వహిం చారు. తెలుగు రాష్ట్రాల తర్వాత అల్లు అర్జున్‌కు కేరళలోనే భారీ సంఖ్యలో ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన సినిమాలు తెలుగులో ఎలా రిలీజ్ అవుతాయో అలా కేరళలో కూడా రెగ్యులర్‌గా రిలీజ్ అవుతాయి.
రిలీజ్‌కి ముందే రికార్డులు
ఇదిలా ఉండగా ‘‘పుష్ప 2’’ మూవీ రిలీజ్‌కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. తమిళనాడులో ఈ సినిమాను ఏకంగా 600 లొకేషన్స్ లో, 800 స్క్రీన్స్ లో మొదటి రోజున ఆల్మోస్ట్ 3500 షోలు వేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు 50 వేల టికెట్స్ అమ్ముడు అయినట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 3230 షోలను ప్రదర్శించబోతున్నారు.
– రాంబాబు వర్మ లంక