Pushpa 2: పుష్ప2 మూవీ ఆన్లైన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడో? తెలుసా..

తెలుగు సినీ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో బాక్సాఫీస్ వద్ద భీభత్సవం సృష్టిస్తోంది అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Puspha 2) . భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి వసూలు రాబడుతోంది. సౌత్ కంటే కూడా పుష్ప కు నార్త్ లోని అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈ మూవీ నార్త్ కలెక్షన్స్ తగ్గేదే లేదు అన్నట్టు ప్రతి రోజుకి పెరుగుతూ ఉన్నాయి. విడుదలైన 10 రోజులలోనే వెయ్యి కోట్లు వసూలు చేసి ఈ మూవీ సినీ ఇండస్ట్రీలో కనీ వినీ ఎరుగని రికార్డు నెలకొల్పింది.
2024 సంవత్సరంలో భారత దేశంలోని అత్యధిక మొదటి పది రోజుల వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది. రోజు నుంచి 100% ఆక్యుఫెన్సీ తో కొనసాగుతున్న ఈ చిత్రం ఆన్లైన్ స్ట్రీమింగ్ (Puspha ott) కి ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ చిత్రంలో జాతర సన్నివేశం, ఇంటర్వెల్ ముందు సీన్.. సినిమా ఎండింగ్ సీన్ ఇలా కొన్ని సన్నివేశాలు ఒక్కసారి చూస్తే తనివి తీరవు అని బన్నీ లవర్స్ భావిస్తున్నారు. దీంతో ఈ మూవీ ఆన్లైన్లో ఎప్పుడు విడుదలవుతుందా అన్న విషయంపై జోరుగా డిస్కషన్ సాగుతోంది.
పుష్ప 2 మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఆన్లైన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. చిత్రానికి సంబంధించిన ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్(Netflix) .. ఈ మూవీని అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో జనవరి 9న స్ట్రీమింగ్ చేస్తుంది. అయితే ఒక్క హిందీ వర్షన్ మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అంటే సౌత్ లో నాలుగు వారాల థియరిటికల్ విండో ఉంటే నార్త్ లో మాత్రం పుష్ప చిత్రం ఏకంగా 8 వారాల థియరిటికల్ విండో మైంటైన్ చేస్తోంది. దీనికి అక్కడ లభిస్తున్న ఆదరణ ముఖ్య కారణం. ఇక మూవీ లవర్స్ ఈసారి సంక్రాంతికి పుష్ప చిత్రాన్ని చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేయవచ్చు. స్ట్రీమింగ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే విడుదలయ్య అవకాశం ఉంది.