Manchu Manoj: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించిన మంచు మనోజ్

నవరాత్రుల సందర్భంగా 51 శక్తి పీఠాలలో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి పొందిన అస్సాం గౌహతిలోని పవిత్ర పుణ్యక్షేత్రం కామాఖ్యదేవి ఆలయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj). సతీమణి భూమా మౌనిక, స్నేహితులతో కలిసి గౌహతి చేరుకున్న మనోజ్ కు హోటల్ సిబ్బంది స్వాగతం పలికారు. ఆయన కొత్త సినిమా మిరాయ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో అందరినీ ఆకట్టుకున్నారు మనోజ్. మిరాయ్ విజయం తర్వాత అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు మనోజ్. ఇప్పుడు కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.