Janhvi Kapoor: చరణ్ వర్కింగ్ స్టైల్ కు జాన్వీ ఫిదా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది(Peddi). విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా జాన్వీ ఈ సినిమాపై కామెంట్స్ చేసి సినిమాపై ఉన్న హైప్ ను పెంచేసింది.
జాన్వీ నటించిన తాజా బాలీవుడ్ సినిమా సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి(sunny sanskari ki tulsi kumari) ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు ఈ కామెంట్స్ చేసింది. పెద్ది మూవీలో తన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని, తన పాత్ర అందరికీ ఆసక్తిని కలిగిస్తుందని చెప్పిన జాన్వీ, బుచ్చిబాబు రూటెడ్ డైరెక్టర్ అని, ఆయన్నుంచి గతంలో వచ్చిన ఉప్పెన కూడా హిట్ గా నిలిచిందని, ఆయనకు మంచి విజన్ ఉందని చెప్పింది.
అదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, ఆయన వర్కింగ్ స్టైల్ కు తాను ఫిదా అయ్యానని చెప్పింది జాన్వీ. ఐ లవ్ రామ్ సర్ అంటూ చెప్పిన జాన్వీ, ఆయన ఓ జెంటిల్‌మెన్ అని, చాలా ఎనర్జీతో కనిపిస్తారని, ఎంత పెద్ద స్టార్ అయినా ఆయన సెట్ లోకి వచ్చేటప్పుడు ఓ స్టూడెంట్ లాగానే వస్తారని, ఆ సెట్ లో ఉండటం తన లక్ గా భావిస్తున్నానని జాన్వీ తెలిపింది.