Jacqueline Fernandez: టైగర్ ప్రింట్ డ్రెస్ లో సూపర్ స్టైలిష్ గా జాక్వెలిన్
జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez). ఈ పేరు తెలియని వారుండరు. మోడల్ గా, నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జాక్వెలిన్ ఈ మధ్య రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. తాజాగా టైగర్ ప్రింట్ స్ట్రాపీ గౌన్ లో ఎంతో స్టైలిష్ గా మెరిసింది జాక్వెలిన్. ఈ డ్రెస్ ఆమె అందాన్ని పెంచడమే కాకుండా అందరినీ ఇట్టే ఎట్రాక్ట్ చేసింది. ఈ డ్రెస్ చూసిన ఫ్యాన్స్ ఆమెను టైగర్ గర్ల్ అని పిలుస్తూ జాక్వెలిన్ షేర్ చేసిన ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.







