Pranitha Subhash: పిల్లల కోసమే ఇండస్ట్రీలోకి రావడం లేదు

ఏం పిల్లో ఏం పిల్లడో(Em pillo em pillado) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రణీతా సుభాష్(Pranitha Subhash) మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. తన క్యూట్ లుక్స్ తో మెప్పించిన ప్రణీతా ఆ తర్వాత హీరోయిన్ గా వరుసపెట్టి సినిమాలు చేసింది. కానీ అమ్మడికి కోరుకున్న సక్సెస్ మాత్రం అందలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించింది.
అత్తారింటికి దారేది(attharintiki daredhi) సినిమాలో పవన్ కళ్యాణ్(pawan kalyan) సరసన నటించి ఆ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ సక్సెస్ కూడా ప్రణీతాకు పెద్దగా ఉపయోగపడలేదు. అవకాశాలైతే వస్తున్నాయి కానీ వాటి వల్ల అమ్మడి కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు మాత్రం వెళ్లడం లేదు. దీంతో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ప్రణీతా. ప్రస్తుతం అమ్మడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ప్రణీతా సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఫ్యాన్స్ తో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. రీసెంట్ గా ప్రణీతాను మీరెందుకు సినిమాలకు దూరంగా ఉంటున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా, అమ్మడు దానికి స్పందిస్తూ తన పిల్లల వల్లే తాను సినిమాలకు దూరంగా ఉన్నానని, వారిని చూసుకోవడానికే సినిమాల్లోకి రావడం లేదని చెప్పుకొచ్చింది. పిల్లల కోసం ప్రణీతా కెరీర్ నే త్యాగం చేసిందని ఫ్యాన్స్ ఆమెను తెగ పొగిడేస్తున్నారు.