Amaran OTT: అమరన్ ఓటీటీ అప్పుడే.. అందుకే ఆలస్యం..

దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా శివ కార్తీకేయన్ అమరన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికి కూడా సందడి చేస్తూనే ఉంది.. ఈసారి దీపావళికి వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.. అయితే అమరన్ మాత్రం రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శివకార్తికేయన్, సాయి పల్లవి అద్భుతమైన నటన కనబరిచిన అమరన్ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం అద్భుతంగా కలెక్షన్స్ సాధించి తాజాగా 250 కోట్ల మార్పును కూడా దాటేసింది. దివంగత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ యదార్ధ గాధను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెరకెక్కిచ్చిన ఈ చిత్రంలో శివ కార్తికేయం మిలిటరీ ఆఫీసర్ పాత్రను పోషించగా..సాయి పల్లవి అతని భార్య పాత్రలో నటించింది. ఈ మూవీకి సంబంధించిన ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ 60 కోట్ల ఫ్యాన్సీ మొత్తానికి సొంతం చేసుకుంది. నిజానికి ఈ చిత్రం నవంబర్ చివరన లేక డిసెంబర్ తొలి వారంలో స్ట్రీమింగ్ కావలసి ఉంది. అయితే ఇప్పటికి కూడా మంచి థియేటర్ ఆక్యుఫెన్సీ తో కలెక్షన్స్ వసూళ్లు చేస్తుండడంతో ఈ మూవీ ఓటీటీ లోకి కాస్త లేటుగా వచ్చేలా ఉంది.
నెట్ ఫిక్స్ ఈ చిత్రాన్ని డిసెంబర్ లాస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో కొనసాగితే అమరన్ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కానుకగా ఆన్లైన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ మూవీ తో శివ కార్తికేయన్ తమిళ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అలాగే ఈ చిత్రంతో అతను టాలీవుడ్ లో కూడా ఓ భారీ రేంజ్ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు.