Kattalan: ‘మార్కో’ మ్యాసీవ్ సక్సెస్ తర్వాత ‘కట్టలన్’ గ్రాండ్‌గా లాంచ్
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మార్కో పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్‌పై ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ మరో భారీ ప్రాజెక్ట్ కట్టలన్ (Kattalan) ను లాంచ్ చేశారు. మలయాళం, తెలుగు భాషల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ పూజా కార్యక్రమం కొచ్చిలో అద్భుతంగా జరిగింది.
బాహుబలిలో కనిపించి ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు పూజా కార్యక్రమంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లగ్జరీ కార్లు, బైక్‌లు కూడా ఈవెంట్‌ను మరింత స్పెషల్ చేశాయి. సినిమాలోని కథలైన్ను దృష్టిలో పెట్టుకుని పూజా ప్రెజెంటేషన్ కూడా డిజైన్ చేశారు. ఈవెంట్లో యాంటోని వర్గీస్, కబీర్ దూహన్ సింగ్, రాజిషా విజయన్, హనన్ షా, జగదీష్, సిద్దిక్, పార్త్ తివారీ లాంటి స్టార్లు హాజరై గ్లామర్‌ని మరింత పెంచారు.
సుమారు ₹45 కోట్లు బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్-ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ టైటిల్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అయ్యింది. డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తుండగా, కాంతార, మహారాజా సినిమాలతో సౌత్‌లో సంచలనం సృష్టించిన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘మార్కో’ కోసం కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ని తీసుకొచ్చిన క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్, ఇప్పుడు మరో బిగ్ కంపోజర్‌ని పరిచయం చేస్తోంది.
టైటిల్ డిజైన్ కోసం జైలర్, లియో, జవాన్, కూలీ సినిమాలకు పనిచేసిన ఐడెంట్ లాబ్స్‌ని తీసుకున్నారు. హీరోయిన్గా రాజిషా విజయన్ నటించనున్నారు. నటీనటుల్లో తెలుగు నటుడు సునీల్, ‘మార్కో’తో మలయాళంలో పాపులర్ అయిన కబీర్ దూహన్ సింగ్, వ్లాగర్-సింగర్ హనన్ షా, ర్యాపర్ బేబీ జీన్, తెలుగు నటుడు రాజ్ తిరందాసు, అలాగే సీనియర్ నటులు జగదీష్, సిద్దిక్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పొన్నియన్ సెల్వన్ 1, బాహుబలి 2, జవాన్, బాఘీ 2 వంటి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేసిన వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్ కేచా ఖాంఫక్డీ ఈ సినిమాలో కూడా స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. డైలాగ్స్ ఉన్నీ ఆర్. ఎడిటర్ షమీర్ మహమ్మద్, ప్రొడక్షన్ కంట్రోలర్ దీపక్ పరమేశ్వరన్. త్వరలో సినిమా కాస్ట్ & క్రూ మరిన్ని అప్డేట్స్ రివిల్ చేయనున్నారు.







