Pawan Kalyan: ఆ సినిమా క్యాన్సిల్, పవన్ షాకింగ్ డెసిషన్..?

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా ప్రయాణంపై అభిమానులలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బిజీ అయిపోయారు. పార్టీ మీద కూడా దృష్టి పెట్టడం లేదు. సెప్టెంబర్ నుంచి ఆయన పార్టీ మీద దృష్టిపెట్టే అవకాశం ఉందనే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు సినిమాల పరిస్థితి ఏంటి అనేది పెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.
ఒకటి హరిహర వీరమల్లు సినిమా కాగా, మరొకటి ఓజి. ఇంకో సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తోంది. ఈ సినిమా టైటిల్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అని పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూడు సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది. దాదాపు ఆరు నెలల నుంచి హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా రిలీజ్ డేట్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంతో ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఇక సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓ జి సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం విజయవాడ సమీపంలో కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాను కూడా త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా బెజవాడలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే దిశగా డైరెక్టర్ అడుగులు వేస్తున్నట్లు టాక్. అవసరమైతే ముంబై లేదా బెంగళూరులో కొంత షూటింగ్ చేసే అవకాశాలు ఉండవచ్చు. ముందు వేరే లొకేషన్ అనుకున్న సరే పవన్ కళ్యాణ్ డేట్స్ కుదరక.. వాటిని క్యాన్సిల్ చేసినట్లు టాక్. మరి ఈ టైంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు.
ఆగస్టు నాటికి ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసేసి రాజకీయాలపై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ కావడంతో హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోయే సినిమా దాదాపుగా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అని తెలుస్తోంది. మరో రెండు మూడు ఏళ్ళు ఆగిన తర్వాత ఆ సినిమాను ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉండవచ్చు అంటున్నాయి సినీ వర్గాలు. ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ కూడా తీసుకోలేదట. ఓజీ కోసం మాత్రమే అడ్వాన్స్ తీసుకోవడంతో ఆ సినిమాను కంప్లీట్ చేసే టార్గెట్ పెట్టుకున్నారు పవన్.