SSMB 29: మహేష్ – రాజమౌళిసినిమాపై ఆఫ్రికా మీడియా సంచలనం

బాహుబలి సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli) చేస్తున్న సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏ సినిమా చేసినా సరే మీడియాలో హడావుడి మాత్రం వేరే లెవెల్ లో జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 30 శాతం కంప్లీట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. వేరే సినిమాలతో పోలిస్తే ఈ సినిమాను చాలా స్పీడ్ గా కంప్లీట్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ హీరో ప్రిథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇండియన్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తుండగా.. ఆఫ్రికా దేశమైన టాంజానియా మీడియా, ది సిటిజెన్ ఓ సంచలన వార్త రాసింది. సినిమా షూటింగ్ గురించి, సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో కూడా ఈ సినిమా షూట్ జరగనుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న టాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్‌లను తీసుకువస్తారని టాంజానియా మీడియా ఆసక్తిగా ఎదురుచూసింది.
జూలై మూడవ వారంలో సెరెంగేటిలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించి, ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్తుందని తమ కథనంలో పేర్కొంది. మహేష్ బాబు 29వ సినిమాను 116 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని వెల్లడించింది. “ఇండియానా జోన్స్, ఆఫ్రికన్ అడ్వెంచర్ క్లాసిక్‌ల నుండి ప్రేరణ పొందిన చిత్రంగా పేర్కొంది. ప్రపంచాన్ని మార్చగల, చాలా కాలంగా కోల్పోయిన రహస్యాన్ని వెలికితీసేందుకు, ప్రకృతి, రహస్యం, శక్తివంతమైన శత్రువుతో పోరాడుతూ, దారి తెలియని భూభాగం ద్వారా ఓ మిషన్‌కు బయలుదేరే అడ్వెంచర్ ను చూపిస్తుందని తెలిపింది. పురాతన ఇతిహాసాలు, అడవి ప్రకృతి దృశ్యాలు, ఈ సినిమాలో ఉంటాయని తెలిపింది.