ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బాక్సాఫీస్ వద్ద వారిసు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

బాక్సాఫీస్ వద్ద వారిసు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన "వారిసు" సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లో ఈ చిత్రాన్ని ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు నిర్మాత దిల్ రాజు. తెలుగులో సంక్రాంతి సినిమాల వల్ల థియేటర్ల సమస్య ఎదురవడంతో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.

వారిసు సినిమాని జనవరి 14వ తేదీన తెలుగులో వారసుడుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని వసూలు చేసిందని టాక్ వస్తుంది. వరల్డ్ వైడ్ గా టోటల్ గా 137.9 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది వారీసు సినిమా. విజయ్ రేంజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదయ్యాయి. సినిమా విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది.

ఇక మొదటి రోజు ఈ సినిమా తమిళనాడులో 20.15 కోట్ల వరకు సొంతం చేసుకుంది. కర్ణాటకలో, 5.62 కోట్లు, కేరళలో 4.55 కోట్లు వసూలు చేయగా, మిగిలిన రాష్ట్రాల్లో 1.15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. విజయ్ సినిమాకు ఈసారి మిగతా రాష్ట్రాలలో మంచి కలెక్షన్స్ రావడం విశేషం. వారీసు సినిమాకి ఓవర్సీస్ నుంచి 14.85 కోట్లు వచ్చాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే విజయ్ సినిమా 46.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ 23.60 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. విజయ్ గత సినిమాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువైనప్పటికీ కూడా సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి మంచి ఒపెనింగ్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద 137.90 కోట్ల వరకు బిజినెస్ చేసింది.   

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :