ట్విట్టర్ కొత్త సీఈవో గా లిండా యాకారినో బాధ్యతలు
ట్విట్టర్‌కు కొత్త సీఈవోగా లిండా యాకారినో బాధ్యతలు స్వీకరించారు. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను ఇటీవల బిలియనీర్ ఎలాన్ మస్క్ కొనుగోలు చేయగా, ఈ సంస్థకు సీఈవోగా ఉన్న అగర్వాల్‌ను ఆయన తొలగించారు. ఆ తర్వాత నుంచి కొత్త సిఈవో కోసం అన్వేషణ జరపగా, తాజాగా యాకారినోను నియమించుకున్నారు. అయితే గతంలో ఎన్‌బిసి యూనివర్సల్‌లో గ్లోబల్ అడ్వైర్టైజింగ్, పార్ట్‌నర్‌షిప్‌ల ప్రెసిడెంట్‌గా లిండా చేశారు. అయితే ఇప్పుడు ట్విట్టర్‌లో తనతో కలిసి పని చేయడానికి ఎన్‌బిసి నుంచి సహచర ఉద్యోగి అయిన జో బెనరోచేని కూడా నియమించుకున్నారు.
Tags :