ASBL NSL Infratech

సంప్రదాయాన్ని తెలిపిన బోస్టన్‌ ఉగాది ఉత్సవాలు

సంప్రదాయాన్ని తెలిపిన బోస్టన్‌ ఉగాది ఉత్సవాలు

బోస్టన్‌ పరిసర ప్రాంతాల సంఘం (టిఎజిబి) ఏప్రిల్‌ 7వ తేదీన నిర్వహించిన ఉగాది వేడుకలు విజయవంతమయ్యాయి. ఆరోజు ఉదయం ఎష్లాండ్‌ హైస్కూల్‌ ప్రాంగణం ఉగాది ఉత్సవాలతో క్రిక్కిరిసిపోయింది. బోస్టన్‌ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం  నిర్వహించిన ఈ ఉగాది వేడుకలకు  దాదాపు 1000 మంది పైగా హాజరుకాగా, రకరకాల కమ్మటి ఫలహారాలు పిల్లల సందడులతో ప్రాంగణం కళకళలాడిరది. బోస్టన్‌ పరిసర ప్రాంతాల తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొని, సాంప్రదాయ- సినీ పాటలు, నృత్యాలు, నాటికలు వంటి వైవిధ్య భరితమైన వినూత్న కార్యక్రమాలు ప్రదర్శించారు. వీనులవిందుగా శాస్త్రీయ సంగీతం, కన్నుల విందుగా నృత్యం, మరెన్నోవైవిధ్యమైన సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు, చిన్నారులు చేసిన ఇంకెన్నో ఉత్సాహ భరితమైన, ఉత్తేజ పూరితమైన సినీ నాట్యాలు ప్రేక్షకులని ఉర్రుతలూగించాయి. సంప్రదాయాన్ని తెలియజేస్తూనే, వినోదం విజ్ఞానాన్ని పంచిన కార్యక్రమం అని ఆహుతులు మెచ్చుకున్నారు. వచ్చిన వారిని టి.ఏ.జి.బి కార్యవర్గం ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం, లడ్డూలతో సాదరంగా ఆహ్వనించింది. టి.ఏ.జి.బి కార్యవర్గం మరియు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలు సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టి.ఏ.జి.బి అధ్యక్షురాలు శ్రీమతి దీప్తీ గోరా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమతి దీప్తీ గోరా, ప్రెసిడెంట్‌-ఎలెక్ట్‌ శ్రీనివాస్‌ గొంది, కార్యదర్శి శ్రీకాంత్‌ గోమఠం, కోశాధికారి దీప్తి కొరిపల్లి, సాంస్కృతిక కార్యదర్శి జగదీష్‌ చిన్నం లను పరిచయం చేసారు. బోర్ద్‌ చైర్మన్‌ శ్రీ కృష్ణా మాజేటీ బోర్డ్‌ సభ్యులు శ్రీయితులు అంకినీడు రవి, శేషగిరి రెడ్డీ, పద్మావతి భిమ్మన మరియు పద్మజా బాలా లను పరిచయం చేసారు. ఎం లైవ్‌ బాండ్‌  వారి ఆధ్వర్యంలో కారుణ్య మాళవిక సంగీత విభావరి ఆహుతలను ఉర్రూతలూగించింది. మెడ్రాస్‌ గ్రిల్‌ వారి ఉపహారాలు, విందు భోజనం పసందుగా రుచిగా అందరి మెప్పు పొందింది. వేదికను చక్కగా అలంకరించిన ఎస్‌ అండ్‌ ఆర్‌ ఈవెంట్స్‌కు మరియు చక్కటి ఆడియో సపోర్ట్‌ అందించిన స్రేవియోకు ధన్యవాదాలు తెలిపారు.

టీమ్‌ ఎయిడ్‌, కీ ప్రైమ్‌రియాల్టీ, స్టెర్లింగ్‌ స్మైల్స్‌, పటేల్‌ బ్రదర్స్‌, స్మార్ట్‌ కిడ్స్‌, న్యూయార్క్‌ లైఫ్‌, సిటీ ఏయిర్‌, ప్యారడైజ్‌ బిర్యానీ పాయింట్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈవెంట్‌ స్పాన్సర్స్‌గా క్లాసిక్‌ ఈవెంట్స్‌, మోక్ష జ్యూవెల్లర్స్‌ తదితరులకు, వలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :