మరోసారి శృతికి బ్రేకప్?
సెలబ్రిటీల జీవితాలు సినిమాల్లో చూపించినట్లు ఒకరితోనే పంచుకోవడం అన్నిసార్లూ కుదరదు. ముందు ఒకరిని ప్రేమించడం, తర్వాత డేటింగ్ లేదంటే పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ వారి లైఫ్ లో చాలా కామన్ గా జరుగుతుంటాయి. ఇప్పుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఈ విషయంలోనే చర్చల్లోకి వస్తుంది. 40 ఏళ్ల వయసుకు దగ్గరగా ఉన్నా వరుస హిట్లు, ఛాన్సులతో శృతి కెరీర్ చాలా బాగా దూసుకెళ్తుంది.
తాజా సమాచారం ప్రకారం, శృతి తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇన్‌స్టా లో ఒకరినొకరు అన్‌ఫాలో అవడమే దీనికి రీజన్ గా చెప్తున్నారు. మూడేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోలు కూడా తమ అకౌంట్స్ లో షేర్ చేశారు. కానీ ఇప్పుడేమైందో ఏంటో తెలియదు కానీ ఆ పోస్ట్‌లను ఇద్దరూ తమ అకౌంట్స్ నుంచి తొలగించారు.
శృతి ఇతని కంటే ముందు ఇటాలియన్ యాక్టర్ మైకెల్ కొర్సాలేతో రిలేషన్ లో ఉంది. అతన్ని పబ్లిక్ గా కొన్ని ఫంక్షన్స్ కు తీసుకొచ్చి మరీ అందరికీ పరిచయం చేసింది. తర్వాత ఎందుకో వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు శంతను నుంచి కూడా శృతి విడిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే శృతి ప్రస్తుతం టాలీవుడ్ లో సలార్-2 తో పాటూ డెకాయిట్ సినిమా చేస్తుంది. చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమాలో కూడా శృతి ఛాన్స్ కొట్టేసింది. ఇవి కాకుండా అమ్మడుకి వెబ్ సిరీస్ ఛాన్సులు కూడా వస్తున్నాయి.