ASBL NSL Infratech

మళ్ళీ రిపీట్ అవ్వబోతున్న మాస్ కాంబో..?

మళ్ళీ రిపీట్ అవ్వబోతున్న మాస్ కాంబో..?

మాస్ రాజా రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇక మాస్ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ధమాకా తో రవితేజ మరోసారి తన సత్తాని చూపించాడు. ఈ నేపథ్యంలో మాస్ హీరో, శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా రాబోతుందని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ద్వయం ఈసారి కాన్పిడెంట్ గా బరిలోకి దిగుతుందా?  వెంకీ మార్క్ ఎంటర్టైన్మెంట్ ని ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది.

ప్రత్యేకంగా ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'నీకోసం, వెంకీ, దుబాయ్ శీను' చిత్రాలతో సక్సెస్ పుల్ కాంబోగా  రవితేజకి, శ్రీను వైట్లకి మంచి పేరుంది. అయితే శ్రీనువైట్ల కెరీర్ ఒక్కసారిగా డిస్టర్బ్ అయ్యింది. ఎన్ని సినిమాలు చేసినా వరుసగా ప్లాప్స్ వచ్చాయి. ఇలాంటి సమయంలో స్నేహితుడికి మాస్ రాజా పిలిచి మరీ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా అవకాశం ఇచ్చారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద  అనుకోని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

దీంతో శ్రీనువైట్ల కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అతను సినిమా చేసి నాలుగేళ్లు అవుతుంది. కథలున్నా అవకాశాలిచ్చే హీరోలు లేకపోవడంతో ఖాళీగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రవితేజ తన స్నేహితుడు కోసం సాహసానికి సిద్దమైనట్లు వినిపిస్తుంది. ఇటీవలే రవితేజ 'ధమాకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి  తెలిసిందే. సినిమాకి  డివైడ్ టాక్ వచ్చినప్పటికీ  వసూళ్లు బాగున్నాయి.

లాంగ్ రన్ లో సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందని అంచనాలున్నాయి. 'ఖిలాడీ'..'రామారావు ఆన్ డ్యూటీ' తర్వాత రవితేజ సినిమాకి ఈ రకమైన టాక్ రావడం కొంత వరకూ గట్టెక్కినట్లే. ఈ క్రమంలో ఓ హిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రవితేజ-వైట్ల కసిగా వర్కౌట్ చేస్తున్నారుని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటవలే శ్రీను వైట్ల రాజాకి కథ వినిపించారుట. అది  వెంకీ తరహా ఎంటర్ టైనర్ అని సమాచారం. కథ నచ్చడంతో రవితేజ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసారట. మరి ఇందులో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :