ASBL NSL Infratech

2024 సంక్రాంతికి మెగా వ‌ర్సెస్ మెగా

2024 సంక్రాంతికి మెగా వ‌ర్సెస్ మెగా

2023 సంక్రాంతికి మెగా స్టార్ చిరూ న‌టించిన వాల్తేరు వీర‌య్య‌, నంద‌మూరి బాల‌కృష్ణ వీర‌సింహా రెడ్డి సినిమాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మెగా వ‌ర్సెస్ నంద‌మూరి అన్న‌ట్లుగా సాగిన ఈ పోరు వ‌చ్చే ఏడాది మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉండే అవ‌కాశాలున్నాయి. 

మెగా కాంపౌండ్‌తో పాటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో న‌డుస్తున్న టాక్ ప్ర‌కారం మెగా హీరోలు ఇద్ద‌రు వ‌చ్చే ఏడాది సంక్రాంతిపై లుక్ వేశార‌నే వార్త‌లొస్తున్నాయి. ఆ ఇద్ద‌రు హీరోలు రామ్ చ‌ర‌ణ్ మ‌రియు బ‌న్నీ, ఇద్ద‌రు కూడా సంక్రాంతికే త‌మ సినిమాలు రిలీజ్ చేయాల‌ని పోటీ ప‌డుతున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. 

శంక‌ర్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఆర్‌సీ15 సినిమాతో చ‌ర‌ణ్ ఈ ఏడాదిలో రిలీజ్ చేయాల‌నుకున్నా కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమా షూటింగ్ లేట‌వుతూ వ‌స్తుంది. అందుకే సంక్రాంతి వ‌ర‌కు వెయిట్ రావాల్సి రావ‌చ్చు. పైగా దిల్‌రాజుకు సంక్రాంతి సీజ‌న్ క‌లిసి వ‌స్తుంది. అందుకే రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికే విడుద‌ల చేసే ఛాన్సులున్నాయి. 

ఇక సూప‌ర్ హిట్ మూవీ పుష్ప సీక్వెల్ గా వ‌స్తున్న పుష్ప‌2 రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఈ సినిమా సీక్వెల్ కూడా వ‌చ్చే సంక్రాంతికే రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు. మొన్న సంక్రాంతికి రెండు సినిమాల‌తో ర‌చ్చ చేసిన మైత్రీ మూవీ మేక‌ర్స్, వ‌చ్చే సంక్రాంతికి క‌చ్చితంగా పుష్ప‌2ను థియేట‌ర్ల‌లోకి దింపాల‌ని చూస్తున్నారు.  

ఈ రెండు సినిమాల మాత్ర‌మే కాకుండా మ‌రి కొన్ని పెద్ద హీరోల సినిమాలు మ‌రియు వేరే చిన్న సినిమాలు కూడా వ‌చ్చే ఏడాది సంక్రాంతిపై క‌న్నేశాయి. ఇంకా ఏడాది స‌మ‌యం ఉండ‌గానే క‌ర్చీఫ్‌ను వేసుకునేందుకు హీరోలు పోటీ ప‌డుతున్నారు. రెండు మూడు నెల‌ల్లో అఫీషియ‌ల్‌గా కూడా ప్ర‌క‌ట‌న‌లొచ్చినా ఆశ్చ‌ర్యం లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :