అంతర్జాతీయ వేదికపై రామ్ చరణ్... ఆ ఘనత అందుకున్న ఏకైక హీరోగా రికార్డ్

అంతర్జాతీయ వేదికపై రామ్ చరణ్... ఆ ఘనత అందుకున్న ఏకైక హీరోగా రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళి ఐదు రోజులు అవుతుంది. అక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా బిజీ బిజీగా ఉన్నారు.  వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమెరికాలోని ఓ ఆలయంలో అయ్యప్ప మాల తీసిన తర్వాత 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నారు. 'ఏబీసీ న్యూస్'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అభిమానులతో ముచ్చటించారు. 'ఆర్ఆర్ఆర్', 'నాటు నాటు' సాంగ్, ఎస్.ఎస్. రాజమౌళి గురించి గొప్పగా చెప్పారు. క్రాస్ ఓవర్ మూవీస్ చేయాలని ఉందని ఆసక్తి వ్యక్తం చేశారు.

బేవెర్లీ హిల్స్‌లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో రామ్ చరణ్ సందడి చేశారు. 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. హెచ్‌సీఏ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్'కు నాలుగు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల వేడుకలో రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకున్నారు.
 
హెచ్‌సీఏ అవార్డుల్లో ప్రజెంటర్‌గా 'బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్'ను రామ్ చరణ్ అనౌన్స్ చేశారు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన పక్కన నిలబడటమే అవార్డ్ అని నటి ఏంజెలా చెప్పారు. హాలీవుడ్ సినిమాకు అవార్డ్ ఇచ్చే గౌరవం అందుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ నిలిచారు. తెలుగు ప్రేక్షకులకు, భారతీయులకు ఇది ఎంతో గర్వకారమైన క్షణం అని చెప్పాలి.  

'మగధీర', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగిన రామ్ చరణ్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారతీయత ప్రతిబింబించేలా చక్కటి నడవడికతో అందరి మనసులు గెలుచుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ అనే పదానికి నిజమైన అర్థం ఏమిటనేది చేతల్లో చూపిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్ అని పేర్కొన్నరు

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :