ASBL NSL Infratech

అదే జ‌రిగితే ఎన్టీఆర్ 30 కు నేష‌న‌ల్ క్రేజ్ క‌న్ఫ‌ర్మ్!

అదే జ‌రిగితే ఎన్టీఆర్ 30 కు నేష‌న‌ల్ క్రేజ్ క‌న్ఫ‌ర్మ్!

ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందే ఈ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ ఈ సినిమాను ఇప్ప‌టికీ ప‌ట్టాలెక్కించ‌లేదు. మ‌ధ్య‌లో ఈ సినిమా ఆగిపోయింద‌ని కూడా వార్త‌లొచ్చాయి. కానీ ఆ వార్త‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు టీమ్ ఖండిస్తూనే వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో ఈ సినిమా ఘ‌నంగా లాంచ్ కానుందని తెలుస్తోంది. 

ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంట‌ర్నేష‌న్‌లో లెవ‌ల్ లో మంచి క్రేజ్ వ‌చ్చింది. రీసెంట్‌గా ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ద‌క్కింది. ఇలాంటి టైమ్ ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుండ‌టంతో అంద‌రి క‌ళ్లూ ఈ ఈవెంట్ మీదే ప‌డే అవ‌కాశ‌ముంద‌. దానికి త‌గ్గ‌ట్టుగానే కొర‌టాల అండ్ టీమ్ కూడా ఈ లాంచింగ్ ఈవెంట్‌ను మ‌రింత గ్రాండ్ గా చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఇందులో భాగంగానే ఈవెంట్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ ను చీఫ్ గెస్టులుగా తీసుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

రాజ‌మౌళి, ఆయ‌న ఫ్యామిలీ, రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ ఈవెంట్‌కు వ‌చ్చే ఛాన్సుంద‌ని స‌మాచారం. అలాగే కొన్నాళ్లుగా మెగాస్టార్, కొర‌టాల మ‌ధ్య దూరం పెరుగుతుంద‌ని వార్త‌లొస్తున్నారు. ఈ సంద‌ర్భంలో ఈ ఫంక్ష‌న్‌కు చిరూని కూడా ఇన్వైట్ చేశార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ, అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నే విష‌యంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొద‌లౌతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఓ ప‌క్క ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించిన రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే ఓ సినిమాను రెడీ చేసి, మ‌రో సినిమాను షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. మ‌రి ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో ఎందుకు ఇంత అశ్ర‌ద్ధ‌గా ఉన్నారో అంతుప‌ట్ట‌డం లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :