బాలయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇకనైనా ఆపేస్తే బెటర్

రీసెంట్ గా హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు కావడం సోషల్ మీడియాలో నానా రచ్చకు కారణమైంది. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు రావడం, ఎన్టీఆర్- బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య అర్థం లేని గొడవకు దారి తీస్తుంది. ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కు కావాలనే రాలేదని ఓ వర్గం ఫ్యాన్స్ కావాలని ప్రచారం చేస్తున్నారు కూడా.
ఇవన్నీ చూసి అసలేం జరిగిందనేది కూడా మినిమం ఆలోచించకుండా తొందరపడి ఒకరి హీరో ఫ్యాన్స్ మరొకరి ఫ్యాన్స్ తో గొడవలు పెట్టుకుని, ట్విట్టర్ లో స్పేస్ లు పెట్టుకుని మరీ తిట్టుకునే వరకు వెళ్లింది. వాస్తవానికి అదే రోజున జూ. ఎన్టీఆర్ బర్త్ డే కావడం, ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లాలనుకుని దాని కోసం చాలా ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ శత జయంతి ఉత్సవాలకు హాజరు కాలేకపోయాడు.
ఇదంతా తెలిసినా కూడా దాన్ని అంగీకరించడానికి కొంతమందికి మనసు రావట్లేదు. బాలయ్య, ఎన్టీఆర్ లు అస్తమానం కలుసుకోకపోయినా, ఏళ్లకు ఏళ్లు అయితే వాల్లు దూరంగా లేరు. అరవింద సమేత సక్సెస్ మీట్ కు బాలయ్య ఫంక్షన్ కు రావడానికి కారణం ఎన్టీఆరే. ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ కు ఎన్టీఆర్ వెళ్లడానికి కారణం బాలయ్య మీద ఉన్న ప్రేమే కారణం.
వీటన్నింటినీ వదిలేసి కావాలని ఎన్టీఆర్ రాలేదని కొందరంటుంటే, ప్లాన్ చేసి మరీ ఎన్టీఆర్ లేని రోజున వేడుక నిర్వహించారని మరికొందరంటున్నారు. ఏదైనా సరే ఒకటే ఫ్యామిలీలోని వారంతా బాగున్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా లేని పోని రచ్చ సృష్టించడం సదరు హీరోలకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. కాబట్టి ఇకనైనా ఈ విషయంలో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సైలెంట్ అవడం మంచిది.