ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఉత్తర కొరియాకు ఎదురు దెబ్బ ... తొలిసారిగా ప్రయోగించిన

ఉత్తర కొరియాకు ఎదురు దెబ్బ ... తొలిసారిగా ప్రయోగించిన

ఉత్తర కొరియాలో కిమ్‌ ప్రభుత్వం మిలటరీ కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. పరీక్షలు నిర్వహిస్తున్న ఆ దేశం తొలిసారిగా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం విఫలమైంది. ఉపగ్రహాన్ని తీసుకువెళుతున్న రాకెట్‌ రెండో దశ సమయంలో కనెక్షన్‌ తెగిపోయినట్టు ఉత్తర కొరియా వెల్లడించింది. ఉపగ్రహ ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్టుగా వెల్లడిరచింది.  ఉపగ్రహం శకలాలు కొరియాలోని ఉత్తరం వైపు సముద్ర జలాల్లో పడినట్టుగా తెలిపింది. ప్రయోగం విఫలమై రాకెట్‌ భూమిపైకి దూసుకువచ్చే సమయంలో అసాధారణంగా ప్రయాణించడంతో దక్షిణ కొరియా, జపాన్‌లు వణికిపోయాయి. రాకెట్‌ ఎక్కడ తమ భూభాగం మీద పడుతుందోనన్న భయంతో దేశ ప్రజలు అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లిపొమ్మంటూ హెచ్చరించాయి. చివరికి రాకెట్‌ సముద్రంలో పడడంతో ఆ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :