ASBL NSL Infratech

రష్యా లో కొత్త వైరస్ ... గబ్బిలాల నుంచి

రష్యా లో కొత్త వైరస్ ... గబ్బిలాల నుంచి

కొవిడ్‌ 19 లాంటి వైరస్‌ను రష్యాలోని గబ్బిలాల్లో పరిశోధకులు గుర్తించారు. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వైరస్‌ నియంత్రణ వ్యాక్సిన్లు ఈ కొత్త వైరస్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేమని అంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల బృందం రష్యా గబ్బిలాలపై అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఖోట్సా-2 అనే వైరస్‌లో స్పైక్‌ ప్రొటీన్లను గుర్తించారు. ఇవి మనుషుల్లోని  కణాల్లోకి చొచ్చుకుపోయి. విషపూరితం చేస్తాయని తేల్చారు. కరోనా వైరస్‌లలో ఖోట్సా-2, సార్స్‌`కోవిడ్‌-2 అనేవి ఒకే ఉప కేటగిరీకి చెందినవని పరిశోధకులు తెలిపారు. కేవలం సార్స్‌-కోవ్‌-2 వంటి వేరియంట్లను నియంత్రించడానికి కాదు, సార్బీకో వైరస్‌ల నుంచి రక్షణ కల్పించే యూనివర్సల్‌ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్ట్‌ మైఖేల్‌ లెట్కో తెలిపారు. ఖోట్సా-2 వైరస్‌ వ్యాప్తిస్తే మనుషులకు తీవ్ర అనారోగ్యం ముప్పుందని గుర్తించారు. కోవిడ్‌-19, ఖోట్సా-2 లాంటి వైరస్‌లు ప్రొటీన్‌ స్పైక్‌ల సాయంతో మనుషులపై దాడి చేస్తాయి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :