ASBL NSL Infratech

అవసరాల శ్రీనివాస్ తో హ్యాట్రిక్ కి రెడీ అవుతున్న నాగశౌర్య..

అవసరాల శ్రీనివాస్ తో హ్యాట్రిక్ కి రెడీ అవుతున్న నాగశౌర్య..

మంచి ఫ్లేవర్ ఫుల్ సినిమాలు తీసే డైరెక్టర్ గా శ్రీనివాస్ అవసరాల తెలుగు ఆడియన్స్ కి సుపరిచితుడు. కామెడియన్ గానే కాకుండా రైటర్ గా, డైరెక్టర్ గా ప్రేక్షకులకి గుర్తుండిపోయే సినిమాలు చేసాడు అవసరాల. అష్టాచమ్మా సినిమాతో కొత్త మార్క్ కామెడీతో వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ తానే స్వయంగా కథని రెడీ చేసుకొని, దర్శకుడిగా మరో కొత్త ప్రాజెక్ట్ తో తన లక్ ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు.

హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. ప్రతి సినిమాకి వైవిధ్యమైన పాత్రలని ఎంచుకుంటూ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా నాగశౌర్య స్థిరపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య కాంబినేషన్ తెలుగు తెరపై మరొకసారి రిపీట్ అవబోతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో ఆల్రెడీ "ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద" చిత్రాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

"ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి(పాపా)" అంటూ మరొకసారి సిల్వర్ స్క్రీన్ పై మెస్మేరైజ్ చేయడానికి ఈ కాంబో రెడీ అయింది. మాళవిక నాయర్ హీరోయిన్ గా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో ఆడియన్స్ పాపా సినిమాపై భారీగా అంచనాలు పెంచుకుంచున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజై ప్రేక్షకులని ఆకట్టుకుంది. సినిమా కూడా అదే లెవెల్ లో ఫన్ అండ్ ఫామిలీ రైడ్ గా ఉండబోతుందని శ్రీనివాస్ అవసరాల తెలిపారు. మార్చి 17 న థియేటర్స్ లో సందడి చేయడానికి ఈ సినిమా రెడీ గా ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :