ASBL NSL Infratech

ఈ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు

ఈ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు

మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్‌ రెడ్డి కోసం కాదని, తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ నేత వివేక్‌తో పాటు ఆయన అమిత్‌ షాను కలిశారు. అనంతరం రాజగోపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి  అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఇచ్చిన రాజీనామాను ఈ నెల 8న సభాపతిని కలిసి ఆమోదింపజేసుకుంటానని పేర్కొన్నారు.

భవిష్యత్‌లో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సైతం సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం ఉన్నవారు కాంగ్రెస్‌ పార్టీలో ఉండరన్న ఆయన తప్పుడు వ్యక్తి చేతుల్లోకి పీసీసీ పదవి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.  తనపై చేసిన ఆరోపణలను రేవంత్‌ రెడ్డి రుజువు చేయలేక పోయారని, ఇపట్పికైనా రుజువు చేయాలని సవాల్‌ విసిరారు.  తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పనికొచ్చే విధంగా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :