ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

దెబ్బకు దారికొస్తున్న మాల్దీవులు..

దెబ్బకు దారికొస్తున్న మాల్దీవులు..

భారత బలగాలు మాదేశంలో ఉండడానికి వీల్లేదు. సాంకేతిక నిపుణులకు అవకాశం లేదు.మా దేశప్రాదేశిక సరిహద్దులను మేం రక్షించుకోగలం. మాది చిన్నదేశమైనప్పటికీ.. పెద్దదేశాలు చెప్పినట్లు నడుచుకునే పరిస్థితి లేదు. ఇదీ ఇప్పటివరకూ మాల్దీవు నూతన అధ్యక్షుడు మొయిజ్జు ప్రకటనలు. పూర్తిగా చైనాకు అనుకూలుడుగా ముద్రపడిన మొయిజ్జు.. ఎన్నికల ప్రచారంలోనే భారత వ్యతిరేకతను వ్యక్తపరిచారు. తాము అధికారంలోకి వస్తే భారత దళాలను దేశం నుంచి పంపించివేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో భారత్ వేలు పెడుతోందని ప్రజలను నమ్మించడంలో విజయవంతమయ్యారు . ఎన్నికల్లోవిజయం సాధించిన తర్వాత.. హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు.

ఈ దిశలో ఇప్పటికే తమదళాలను వెనక్కి తీసుకోవాలని భారత్‌ను డిమాండ్ చేశారు. చర్చల్లో భాగంగా ప్రాజెక్టుల నిర్వహణకు సాంకేతిక సిబ్బందిని పంపిస్తామని భారత్ ప్రతిపాదించినా.. దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అంతే కాదు.. ఇన్నాళ్లు పూర్తిసదుపాయాలతో భారత్‌లో వైద్యసదుపాయాలు పొందుతున్నారు మాల్దీవుల పౌరులు. ఇప్పుడు వీరికి అరకొరగా వైద్య సదుపాయాలున్న శ్రీలంకలో వైద్యం చేయించుకునేలా ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాదు.. ఇటీవల చైనాలో పర్యటించి, ఆదేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నారు. అదే సమయంలో భారత్‌పై తన వ్యతిరేకతను సైతం ప్రదర్శించారు.అంతేకాదు... భారత ప్రధాని లక్షద్వీప్ ను టూరిజంహబ్‌గా మార్చేందుకు చేసిన ప్రయత్నాలపై.. సైతం మొయిజ్జు, అతని మంత్రులు సెటైర్ు వేశారు.

భారత సైన్యం మాల్దీవులను విడిచిపెట్టి వెళ్లాల్సిందేనంటూ పట్టుబట్టిన ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు ఉన్నపళంగా స్వరం మార్చారు. భారత్‌ తమకు సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని చెప్పిన ఆయన.. తమ ద్వీప సమూహ దేశానికి రుణ ఉపశమనం కల్పించాలని భారత్‌ను కోరారు. గతేడాది ముగిసేనాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు రూ.3,347 కోట్లు (400.9 మిలియన్‌ డాలర్లు) బకాయిపడింది. గురువారం స్థానిక మీడియాకు ముయిజ్జు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో.. మాల్దీవులకు సాయం అందించడంలో భారతదేశం కీలకపాత్ర పోషిస్తోందని, దీవుల్లో పలు గొప్ప ప్రాజెక్టులను ఇప్పటికే చేపట్టిందన్నారు. కొనసాగుతున్న ప్రాజెక్టులు ఏవీ ఆగిపోకూడదు. గత ప్రభుత్వాలు తీసుకొన్న భారీ రుణాలను తిరిగి చెల్లించడంలో మాకు కొంత ఉపశమనం కల్పించాలి అని భారత్‌ను ఆయన కోరారు. ఈ మేరకు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఇప్పటివరకూ ఇదేవిషయాన్ని మాల్దీవులు మాజీ అధ్యక్షులు చెబుతూ వచ్చారు. భారత్ పెద్దన్నపాత్రలో తమదేశాభివృద్ధికి ఇతోధికంగా సాయం చేస్తోందని.. దాన్ని గుర్తెరగాలన్నారు. అయితే చైనా మోజులో ఉన్న మొయిజ్జు.. భారత్ ను తక్కువగా అంచనా వేశారు. అయితే ఇప్పుడు రుణాలు చెల్లింపు విషయానికొచ్చేసరికి మాత్రం.. భారత్ తో ఉన్న సాన్నిహిత్యం గుర్తొచ్చింది మొయిజ్జుకి. ప్రాజెక్టులు ఆగకుండా ఉండాలంటే భారత్‌తో బంధం కొనసాగాలి. ఇంత వ్యతిరేకతతో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడి ప్రతిపాదనలకు మోడీ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :