ASBL NSL Infratech

మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం

మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న హార్వర్డ్‌ ఇండియా కాన్ఫరెన్స్‌లో మంత్రి ప్రసంగిస్తారు. ఈ మేరకు కేటీఆర్‌కు హార్వర్డ్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ నిర్వాహకులు ఇప్పటికే ఆహ్వానం పంపించారు. ఇండియా 2030-ట్రాన్స్‌ఫార్మేషనల్‌ డీకేడ్‌ అనే అంశంపై మంత్రి కేటీఆర్‌ తన ఆలోచనలను పంచుకోబోతున్నారు. 20వ తేదీన సాయంత్రం ఆరున్నర గంటలకు మంత్రి సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమంలో ప్రసంగించబోతున్నారు. ఈ దశాబ్దంలో భారతదేశ పురోగతి శీఘ్రగతిన జరగాలంటే ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ముఖ్యంగా వ్యాపార వాణిజ్యము, ప్రభుత్వ విధానాలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, బిజినెస్‌ మహిళలకు వాణిజ్యము, ప్రభుత్వ విధానాలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, బిజినెస్‌ మహిళలకు ప్రాధాన్యత కల్పించే బిజినెస్‌ ఇంక్యుబేటర్లు, ఐటీ మరియు ఐటీ అనుబంధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తన ఆలోచనలను పంచుకుంటారు.

ఆయా రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తన విప్లవాత్మక, వినూత్న విధానాలతో సాధించిన సానుకూల మార్పులను, ప్రగతిని ప్రస్తావించనున్నారు. తనకు ఆహ్వానం పంపిన హార్వర్డ్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ నిర్వాహకులకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.  కాన్ఫరెన్స్‌లో భాగస్వామి అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :